జో బైడెన్‌కు ఇన్సూరెన్స్ పాలసీలా కమలా హారిస్.. డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికన్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.

ఈ చర్చా కార్యక్రమంలో బైడెన్‌ పూర్తిగా తేలిపోగా.ట్రంప్ చాలా యాక్టీవ్‌గా, దూకుడుగా వ్యవహరించారు.

దీంతో బైడెన్‌ పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.పెద్దాయన శారీరక , మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాలేదని మీడియాలో, సోషల్ మీడియాలో( Social Media ) కథనాలు వస్తున్నాయి.

దీనికి తోడు వైట్‌హౌస్‌కి పార్కిన్సన్ నిపుణుడు తరచుగా వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

"""/" / ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )స్పందించారు.

బైడెన్, కమలా హారిస్‌లను టార్గెట్ చేస్తూ ఆయన సెటైర్లు వేశారు.జో బైడెన్‌కు కమల .

బీమా పాలసీ లాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం బైడెన్ తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా ట్రంప్ అభివర్ణించారు.

కమలా హ్యారిస్‌కు ఉక్రెయిన్ యుద్ధం, బోర్డర్ సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించారని.కానీ ఆమె కనీసం అమెరికా సరిహద్దుకు కూడా వెళ్లలేదన్నారు.

"""/" / భూమ్మీద అత్యంత చెత్త సరిహద్దుగా అది మారిపోయిందని.తన హయాంలో వాటిని అద్భుతంగా కాపాడినట్లు ట్రంప్(Trump ) గుర్తుచేశారు.

ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకుండా ఆపేందుకు కమలా హ్యారిస్‌ను ఐరోపాపై పంపగా.

అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదని చురకలంటించారు.జో బైడెన్, కమలా హ్యారిస్‌ల కారణంగా 1,50,000 మంది పిల్లల జీవితాలు నాశనమయ్యాయని ట్రంప్ ఆరోపించారు.

ఇదిలావుండగా.జో బైడెన్ పార్కిన్సన్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైట్‌హౌస్ స్పందించింది.

బైడెన్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ మీడియాతో అన్నారు.

సాధారణ పరీక్షల్లో భాగంగానే ఓ న్యూరాలజిస్ట్ జో బైడెన్‌ను మూడు సార్లు కలిశారని తెలిపారు.

అయితే సదరు వైద్యుడు ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు.

వలసలను ఆపడం కష్టమేనా ? జగన్ కు చిక్కులేనా ?