డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి నేత .. ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ఎన్నికైన తర్వాత ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే కేబినెట్‌లోకి సమర్ధులైన అధికారులను, నేతలను తీసుకుంటున్నారు.వీరిలో భారత సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు.
ఇప్పటికే జే భట్టాచార్య, వివేక్ రామస్వామి, హర్మీత్ ధిల్లాన్ ( Jay Bhattacharya, Vivek Ramaswamy, Harmeet Dhillon )తదితరులను ట్రంప్ కీలక పదవుల్లో కూర్చోబెట్టారు.
తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)పై సీనియర్ వైట్‌హౌస్ పాలసీ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించారు ట్రంప్.
శ్రీరాం కృష్ణన్( Sri Ram Krishnan ) .వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారని ట్రంప్ ఆదివారం ప్రకటించారు.
గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్‌లలో ప్రొడక్ట్ బృందాలకు నాయకత్వం వహించిన కృష్ణన్.
వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్‌గా ఉండే డేవిడ్ ఓ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తెలిపారు.
"""/" /
డేవిడ్ సాక్స్‌తో( David Sachs ) సన్నిహితంగా పనిచేస్తూ.ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడంపై శ్రీరామ్ దృష్టి సారిస్తారని ట్రంప్ వెల్లడించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ సహా ప్రభుత్వంలో ఏఐ పాలసీని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ సాయపడనున్నారు.
విండోస్ అజూర్ వ్యవస్ధాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో శ్రీరామ్ తన కెరీర్‌ను ప్రారంభించారని ట్రంప్ తెలిపారు.
తన నియామకంపై కృష్ణన్ మాట్లాడుతూ.మనదేశానికి సేవ చేయగలగడం , డేవిడ్ సాక్స్ నేతృత్వంలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉందన్నారు.
మరోవైపు.శ్రీరామ్ కృష్ణన్ నియామకంపై అమెరికాలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.
"""/" /
అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ .శ్రీరామ్‌ను వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా.
చాలా ఏళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శ్రీరామ్‌కు అనుభవం ఉందని తెలిపారు.పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, సాంకేతికతను మిళితం చేసిన ఈ కొత్త పాత్రలో దేశానికి సేవ చేయనున్నారని సంజీవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వీరయ్యను మించేలా డాకు మహారాజ్.. నాగవంశీ అంచనాలను పెంచారుగా!