వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు.
ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరికి వృత్తిపరమైన పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా అందించేది అన్నారు.
ఈ సమావేశంలో దేవాచారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు సూడిద రాజేందర్ ,రాజు నాయక్, ఎండి ఇమామ్ ,గుండ్ల శ్రీనివాస్ ,చెన్ని బాబు ,బిపేట రాజు ,కంచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!