డామినోస్ మాజీ సీఈవో అన్ని పిజ్జాలు లాగించాడా? మరీ లక్షల్లో?
TeluguStop.com
అవాక్కవుతున్నారా? మీరు విన్నది నిజమే.అదెలాగో తెలియాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.
డామినోస్ మాజీ సీఈవో అయినటువంటి 'రిచ్ అల్లిసన్'( Ritch Allison ) ఇపుడు హాట్ టాపిక్ అయ్యారు.
విషయం ఏమంటే, 2022లో ఆయన డామినోస్ కంపెనీ( Domino's Pizza )కి రాజీనామా చేసే క్రమంలో ఆ పదవి తనకు జీవితకాల ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు.
అలా హక్కు అని ఫీల్ అయ్యాడో ఏమో గానీ ఈ మాజీ సీఈవో ఖర్చులకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
అదే ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. """/"/
అసలు విషయం ఏమంటే, ఆయన వ్యక్తిగత పిజ్జా ఖర్చు కోసం దాదాపు 4,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.
3లక్షలకు పై చిలుకు చెల్లించినట్లు తెలిసింది.ఫినాన్షియల్ టైమ్స్( Financial TImes )కథనం ప్రకారం.
డామినోస్ ఎగ్జిక్యూటివ్ పరిహారం కింద 2021 సంవత్సరంలో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసమే అల్లిసన్‌కు కంపెనీ 3,919 డాలర్లు చెల్లించిందని భోగట్టా.
దీంతోపాటు వ్యక్తిగత జెట్, బృంద సభ్యుల బహుమతులు, ఇతర ఖర్చులకు ఆ సంవత్సరానికి అల్లిసన్ మొత్తంగా 7,138,002 డాలర్లు అనగా దాదాపు రూ.
59 కోట్లు అందుకోవడం జరిగింది. """/"/
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమంటే, అల్లీసన్ పిజ్జాల ఖర్చు అనేది అంతకుముందు సంవత్సరం అంటే 2020తో పోల్చుకుంటే తక్కువేనట.
2020 అనగా కరోనా మహమ్మారి సమయంలో ఖర్చు అయిన పిజ్జా విలువ 6,126 డాలర్లు అంటే రూ.
5 లక్షలకు పైనే.డామినోస్ ప్రస్తుత సీఈవో రస్సెల్ వీనర్ (Russell Weiner )కూడా 2021లో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసం 2,810 డాలర్లు ఖర్చు చేసారని వినికిడి.
అల్లిసన్ డామినోస్ కోసం పదేళ్లకుపైగా పనిచేశారు.ఇందులో నాలుగేళ్లు కంపెనీ సీఈవోగా వ్యవహరించారు.
2022లో ఆయన పదవీ విరమణ పొందారు.
ఆ మూవీ హిట్టైతే బాలయ్య ఖాతాలో అరుదైన ఘనత.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా?