నువ్వుల నూనె ఇంట్లో ఉంటే మీ జుట్టు ఒత్తుగా పెర‌గ‌డం ఖాయం!

నువ్వుల నూనె.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

ఈ నూనెలో ఉండే పోష‌క విలువ‌లు మ‌రే నూనెలోనూ ఉండ‌వు.అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో మంది వంట‌ల‌కు నువ్వుల నూనెను ఉప‌యోగిస్తారు.

నువ్వుల నూనె వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించ‌డ‌మే కాదు.మ‌న ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌నూ చేకూరుస్తుంది.

అలాగే కేశాల‌కు కూడా నువ్వుల నూనె ఎంతో మేలు చేస్తుంది.అస‌లు నువ్వుల నూనె ఇంట్లో ఉంటే అనేక జుట్టు స‌మ‌స్య‌ను నివారించుకుని జుట్టును ఒత్తుగా పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ నువ్వుల నూనెను జుట్టుకు ఏ విధంగా ఉప‌యోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మూడు నాలుగు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని లోప‌ల ఉన్న గింజ‌ను తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె మ‌రియు ఉసిరి కాయ పేస్ట్ వేసుకుని బాగా క‌లిపి నైట్ అంత వ‌దిలేయాలి.

నెక్స్ట్ డే ఆ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేశారంటే జుట్టు ఊడ‌టం త‌గ్గి.ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

"""/"/ అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి.

గంట అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది.

చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.మ‌రియు జుట్టు ఒత్తుగానూ పెరుగుతుంది.