నాలుగు మందారం ఆకులతో ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది తెలుసా?

జుట్టు రాలడం( Hair Fall ) అనేది మనలో చాలా మంది అత్యంత కామన్ గా ఫేస్ చేసే సమస్య.

వివిధ కారణాల వల్ల హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది.అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మందారం ఆకులు( Hibiscus Leaves ) చాలా ఉత్తమంగా సహాయపడతాయి.

మందార ఆకులు తలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

మందార ఆకుల్లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టును నిర్మించే కెరాటిన్( Keratin ) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

మందార ఆకులు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.మరియు జుట్టు విరగకుండా చేస్తాయి.

"""/" / నాలుగు మందారం ఆకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

అందుకోసం ముందుగా నాలుగు మందారం ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసుకున్న మందారం ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్,( Amla Powder ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) మరియు పావు కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా మందారం ఆకులతో హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

ముఖ్యంగా ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా నిరోధిస్తోంది.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మందార ఆకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చికాకుగా ఉన్న స్కాల్ప్‌ నుంచి ఉపశమనం అందిస్తాయి.

చుండ్రు సమస్యను దూరం చేయడంలో కూడా ఈ హెయిర్ ప్యాక్ హెల్ప్ చేస్తుంది.

ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు