అల్లంతో ఇలా చేస్తే మీ జుట్టు రాలమన్నా రాలదు.. తెలుసా?

అల్లం.ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిరిగా వాడుతుంటారు.

ఘాటైన రుచి కలిగి ఉండే అల్లం వంటలకు చక్కని రుచిని అందిస్తుంది.ముఖ్యంగా నాన్ వెజ్ మరియు బిర్యానీ వంటి వాటిలో అల్లం కచ్చితంగా పడాల్సిందే.

అలాగే ఆరోగ్యపరంగా కూడా అల్లం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ఎన్నెన్నో జబ్బులను నివారిస్తుంది.

అంతేకాదు జుట్టు సంరక్షణకు కూడా అల్లం ఉపయోగపడుతుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యను అడ్డుకునేందుకు అల్లం ఉత్తమంగా సహాయపడుతుంది.

ఇప్పుడు చెప్పబోయే విధంగా అల్లంను వాడితే మీ జుట్టు రాలమన్న రాల‌దు.అందుకోసం రెండు అంగుళాల అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్‌ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు గోరు వెచ్చని కొబ్బరి నూనె వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), రెండు చుక్కలు టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ( Tea Tree Essential Oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

"""/" / రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఇలా చేస్తే కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను నివారించడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా అల్లం తో పైన చెప్పిన విధంగా చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

ఆ పని చేసే అంత డబ్బు నా దగ్గర లేదు.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!