నెల‌లో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెరగ‌డం ఖాయం!

త‌మ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, నేటి రోజుల్లో ఆ అదృష్టం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉంటుంది.

ఆహారాపు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, జీవ‌న శైలిలో చోటుచేసుకున్న మార్పులు, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, కాలుష్యం, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే ఉత్ప‌త్తుల‌ను జుట్టుకు ఉప‌యోగించ‌డం, రోజూ త‌ల‌స్నానం చేయ‌డం, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను త‌ర‌చూ వాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు వేధిస్తూ ఉంటాయి.

అలాగే కొంద‌రిలో హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోతుంటుంది.అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి జుట్టును న‌ల్ల‌గా, ఒత్తుగా మెరిపించుకోవాల‌నుకుంటే.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మందారం పూరేకల పొడి, రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు ఎగ్ వైట్స్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసి అర గంట పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఈలోపు మ‌రో బౌల్ తీసుకుని అందులో ఆముదం, కొబ్బ‌రి నూనె, ఆలివ్ నూనె స‌మానంగా తీసుకుని బాగా క‌లిపి త‌ల‌కు ప‌ట్టించి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట లేదా రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి త‌ల స్నానం చేయాలి.

"""/" / ఇలా నెల‌లో కేవ‌లం రెండు సార్లు చేస్తే గ‌నుక జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతుంది.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు బ్రేక్ ప‌డుతుంది.తెల్ల జుట్టు త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

మ‌రియు చుండ్రు స‌మ‌స్య‌ నుంచి సైతం ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

వీడియో: యువకుడి జుట్టు చూసి పక్షి గూడు అనుకున్న పిచ్చుక.. కట్ చేస్తే..