మొబైల్ సిగ్నల్ కోసం ఇలా చేస్తున్నారా ? అయితే జాగ్రత్త..

స్మార్ట్ ఫోన్ మన జీవనశైలిలో అతి ముఖ్యమైనదిగా మారిపోయింది.ఎంతలా అంటే ఒక క్షణకాలం కూడా విడిచి ఉండలేనంతగా.

కరోనా ప్రభావంతో వీటి వాడకం మరీ ఎక్కువగా మారిపోయింది.లాక్ డౌన్ సమయంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వాడేవారి సంఖ్య గణనీయంగా మారిపోయింది.

ఇందులో మరీ ముఖ్యమైన సమస్య మొబైల్ సిగ్నల్.చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోంటున్నారు.

మొబైల్ సిగ్నల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరీ సిగ్నల్ కోసం తంటాలు పడుతుంటారు.

ఏ మూలన సిగ్నల్ అందిన అక్కడే అతుక్కుపోతుంటారు.అయితే ఈ సిగ్నల్ సమస్యలను అధిగమించడానికి చాలా మంది వారి ఇళ్ళలో సిగ్నల్ బూస్టర్ ‏లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇంటి పైకప్పు మీద సిగ్నల్‌ బూస్టర్‌ లను ఏర్పాటు చేయడం వల్ల మొబైల్‌ సిగ్నల్‌ పెరుగుతుంది.

ఇంటర్నెట్‌ స్పీడ్‌ గా వస్తుంది.కాల్‌ డ్రాప్స్‌ ఉండవు.

కానీ ఈ బూస్టర్‌ లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లేదు.కానీ వీటిని ఏర్పాటు చేసుకోవడాన్ని టెలికాం శాఖ నిషేదించింది.

మొబైల్ సిగ్నల్ పెంచాలంటే అది టెలికాం సంస్థలు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది.

ఈ బూస్టర్‌స్ వలన చుట్టూ పక్కల వారికి నెట్ వర్క్ సమస్య మరింత పెరిగిపోతుంది.

ఢిల్లీలో ఇటీవలి కాలంలో ఇలా మొబైల్‌ సిగ్నల్‌ బూస్టర్‌ లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరిగింది.

దీంతో అలాంటి వారిని గుర్తించి వారి ఇళ్లపై ఏర్పాటు చేసిన బూస్టర్‌ లను అధికారులు తొలగిస్తూ వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

బుస్టర్స్ వినియోగించడం వలన ఎలాంటి నెట్ వర్క్ సమస్యలు ఉండవు.కానీ మీ చుట్టూ ఉండే వారికి మాత్రం సిగ్నల్ సమస్యలు ఎదురవుతాయి.

అందుకే టెలికాం సంస్థ వీటిని నిషేందించింది.మీకు కూడా ప్రతిసారి సిగ్నల్ సమస్యలు ఎదురవుతుంటే.

ఒకసారి ఇలాంటి నెట్ వర్క్ బూస్టర్స్ మీ చుట్టూ పక్కల కూడా ఉంటేవెంటనే టెలికాం సంస్థలకు సమాచారాన్ని అందించండి.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!