నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ పోవడం ఖాయం!
TeluguStop.com
కంటి నిండా నిద్ర లేకపోయినా, ఒత్తిడి పెరిగినా, ఎండల్లో ఎక్కువగా తిరిగినా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తుంటారు.
అలాగే ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, పలు రకాల మందుల వాడకం, స్మార్ట్ ఫోన్లను అధికంగా వాడటం వంటి కారణాల వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
ఏదేమైనా డార్క్ సర్కిల్స్ చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు అందాన్ని సైతం దెబ్బ తిస్తాయి.
అందుకు డార్క్ సర్కిల్స్‌ను వదిలించుకోవడం కోసం నానా ప్రయోగాలు చేస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను రోజూ నైట్ నిద్రించే ముందు రాసుకుంటే డార్క్ సర్కిల్స్ పోవడమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు ఆరెంజ్ పండ్లను తీసుకుని.వాటి నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత ఒక బౌల్‌లో ఆరెంజ్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి స్లో ఫ్లేమ్‌పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.బాగా కూల్ అయిన వెంటనే అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్ సీడ్ జెల్, రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను కళ్ల చుట్టూ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి.
ఉదయాన్నే కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గిపోతాయి.
పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?