ప్రభాస్ తో కాకుండా ఆ హీరోతో సినిమా చేయటం వల్ల కెరియర్ నాశనం అయింది: అమ్మ రాజశేఖర్

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు వెళుతుంటారు.అయితే ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్లుగా వచ్చి దర్శకలుగా మారినటువంటి వారు చాలామంది ఉన్నారు.

ఇలాంటి కోవలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా( Prabhu Deva ), లారెన్స్ ( Raghava Lawrence )వంటి వారు ఉన్నారని చెప్పాలి.

అయితే మరొక డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar) మాస్టర్ సైతం దర్శకుడిగా మారి సినిమాలు చేశారు.

అయితే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమ్మ రాజశేఖర్ మాస్టర్ తన సినిమాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" /   గోపీచంద్(Gopichand) హీరోగా రణం సినిమా దర్శకత్వం వహించిన తర్వాత తాను ప్రభాస్( Prabhas) తో ఓ సినిమా చేయాలని కథ మొత్తం సిద్ధం చేసుకున్నాను.

ప్రభాస్ ను కలవడానికి కూడా కబురు పంపారు.అయితే ఆరోజు నాకు వేరే పని ఉండటంతో కలవలేకపోయాను.

అనంతరం ప్రభాస్ గారిని కలవడానికి వెళ్తే ఆయనకు బిజీగా ఉన్నారు.ఆ విధంగా ప్రభాస్ ను కలవడం కుదరలేదు.

ప్రభాస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా నితిన్em / (Nithin)ఫోన్ చేసి తనకు ఒక పాట కొరియోగ్రఫీ చేయాలని తెలిపారు.

అయితే తన దగ్గర ఉన్న కథను నితిన్ కి వినిపించాను. """/" /   అంతా ఓకే అనుకున్నాక కథ తేడా అనిపించి మారుద్దామని అనుకున్న సమయంలో మచ్చా రవి ( Macha Ravi ) నా దగ్గర స్క్రిప్ట్ కి పనిచేసే వాడు అతను కథ వినిపించి ప్రొడ్యూసర్స్ తో ఓకే చేయించుకోవడంతో నాకు ఇగో హర్ట్ అయింది.

దీంతో ఎలాగైనా నితిన్ తో సినిమా చేయాలని భావించి తమిళ రీమేక్ సినిమాని చేశాను.

అలా నితిన్ హీరోగా టక్కరి( Takkari ) సినిమా చేశానని తెలిపారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ అని నాకు ముందే తెలిసినప్పటికీ చేశాను.

ఇలా ప్రభాస్ తో సినిమా చేయాల్సిన నేను నితిన్ తో సినిమా చేసి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నానని ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

టెక్నీషియన్‌తో మహిళ అఫైర్.. గీజర్‌లో కెమెరా పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ నాటకం.. చివరకు?