శునకాలను తింటోందని మొసలిని కొట్టి చంపి కోసుకుతిన్న గ్రామస్థులు.. ఎక్కడంటే..?
TeluguStop.com
నీటిలో రారాజు ఎవరంటే మొసలి( Crocodile ) అని అందరూ చెప్పే సమాధానం.
అవును.నిజమే ఎంత పెద్ద జంతువైనా సరే.
మొసలి ముందు నీటిలో అదో చిన్న చీమ లాంటిది మాత్రమే.నీటిలో అంతలా తన బలాన్ని ప్రదర్శిస్తుంది మొసలి.
అంతెందుకు సోషల్ మీడియాలో కూడా మొసల్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం.
అయితే తాజాగా ఓ మొసలి సంఘటన ప్రపంచం మొత్తం వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" /
అది ఒక పెద్ద మొసలి.
ఓ నదిలో( River ) జీవిస్తోంది.అయితే నది వద్దకు నీటిని తాగడానికి వస్తున్న కుక్కలను( Dogs ) అలాగే ఇతర జంతువులను అది కనిపెట్టుకొని ఆరగించేస్తోంది.
ఈ భయానకరమైన మొసలిని చూసి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని జీవిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఆ నది పొంగిపొర్లడంతో తరచుగా మొసలి గ్రామంలోకి రావడం మొదలు పెట్టింది.
అయితే ఈ విషయాన్ని అక్కడే గ్రామస్తులు మొసలి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు( Police ) అందించారు.
ఇక పోలీసులు అంత భారీ ముసలిని భద్రంగా జూకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేమంటూ వారు చేతులెత్తేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామస్తులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ ముసలిని చంపేయాల్సిందేనని తీర్మానం చేసుకున్నారు.
"""/" /
ఒకవేళ చంపకపోతే జంతువులకు పడిన గతే గ్రామస్తుల కూడా పడుతుందన్న ఉద్దేశంతో దానిని చంపడానికి నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కాచుకొని ఉన్న గ్రామ ప్రజలకు ఓ రోజు వీధి సునకాలను తినడానికి నీటి నుంచి బయటికి వచ్చింది మొసలి.
దాంతో పోలీసులు దానిని కాల్చి చంపారు.చనిపోయిన మొసలిని గ్రామస్తులు ఖండ ఖండాలుగా కోసి పంచుకొని తిన్నారు.
అది కూడా సంప్రదాయబద్ధంగా విందు చేసుకున్నారు.ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో క్రొకడైల్ ఫెస్ట్ జరుపుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
ఆ సీన్లను డైరెక్టర్ సుకుమార్ కాపీ చేసి సినిమాలో పెట్టారా.. అసలేం జరిగిందంటే?