ల్యాండ్ స్లయిడ్ నుంచి మనిషిని రక్షించిన కుక్క.. ప్రాణాలకు తెగించిందిగా..?

కొన్ని వందల సంవత్సరాలుగా కుక్కలు( Dogs ) మానవులకు మంచి స్నేహితులుగా మెలుగుతూ వస్తున్నాయి.

అవి యజమానుల పట్ల ఎంతో ప్రేమగా చూపిస్తాయి.కుక్కలు మనకు వారికి అండగా ఉంటాయి.

వారి ప్రాణానికి తమ ప్రాణాలను అడ్డువేస్తాయి.ఇలాంటి గొప్ప శునకాలకు సంబంధించిన వీడియోలు, కథలు ఎన్నో వైరల్ గా మారాయి.

తాజాగా అలాంటి ఒక హీరో డాగ్( Hero Dog ) వీడియో క్లిప్ వైరల్ గా మారింది.

"""/" / ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఆ వీడియోలో, ఒక కుక్క తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక మనిషిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

కొండ చరియలు కుప్పకూలినప్పుడు,( Landslide ) ఆ మనిషిని కాపాడాలని ఆ కుక్క యజమాని చొక్కా కాలర్‌ను నోటితో పట్టుకుని లాగుతూ ఉంది.

వరద నీరు కుక్క గొంతు వరకు చేరుకున్నా, ఆ కుక్క యజమానిని వదలకుండా వరదల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

చివరికి, కుక్క ఆ మనిషిని లాక్కుంటూ ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంది. """/" / ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్ లో ఒక పెద్ద మట్టి కొండ కుప్పకూలుతూ ఉంది.

ఆ సమయంలో, ఒక మనిషి తన కారు తలుపు తెరచి లోపల ఉన్న వాళ్ళను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు.

కానీ, ఆ వీడియోలో ల్యాండ్ స్లయిడ్ దృశ్యాన్ని ఎవరో ఎడిట్ చేసి ఉండొచ్చు అని కొంతమంది అనుమానిస్తున్నారు.

ఇది నిజమైనా, అబద్ధమైనా కుక్క మాత్రం యజమాని నీటి నుంచి బయటికి లాగిన్ దృశ్యాలు మాత్రమే చాలా రియల్లిస్టిక్‌గా ఉన్నాయి.

ఈ వీడియోను తొమ్మిది లక్షల మందికి పైగా చూశారు.సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియోను చూసి కుక్కను బాగా ప్రశంసించారు.

కుక్కలు మనుషుల కంటే మంచి స్నేహితులు అని కొంతమంది చెప్పారు.మరికొంతమంది హార్ట్ ఎమోజీలు పెట్టి తమ ఆనందాన్ని తెలియజేశారు.

వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం