వీడియో: ఈ కుక్క చేసిన స్టంట్స్ చూస్తే చప్పట్లు కొట్టకుండా ఉండలేరు..
TeluguStop.com
సాధారణంగా కుక్కలు చేసే స్టంట్స్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే కొన్ని చేసే స్టంట్స్ చూస్తే మాత్రం అవక్కవ్వక తప్పదు.
తాజాగా అలాంటి స్టంట్స్ చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వీడియోను @BS అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.
షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 14 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
40 వేల వరకు లైక్స్ వచ్చాయి.ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో ఒక కుక్క సన్నగా ఉన్న కొన్ని వస్తువులపై చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడం చూడవచ్చు.
ఆ తర్వాత అది చాలా ఎత్తుకి ఎగిరింది.ఒక అడ్డంకి పైనుంచి అది పర్ఫెక్ట్‌గా జంప్ చేసింది.
ఆ తర్వాత స్తంభాలలాగా ఉన్న కొన్నిటిపైకి సునాయాసంగా ఎక్కేసింది.అనంతరం చాలా సన్నగా ఉన్న గోడపై వేగంగా నడిచింది.
ఆపై కొద్ది ఎత్తులో కట్టిన రెండు తాళ్లపై బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచింది.అనంతరం చెక్క బ్రిడ్జ్ లాంటి వేలాడే వంతెన పై కూడా వాక్ చేసింది.
చివరికి అది తన వెనుక రెండు కాళ్లను గోడపై ఆనిచ్చి రెండు ముందు కాళ్లపై సన్నని చెక్కపై నడుస్తూ ఆశ్చర్యపరిచింది.
"""/"/
ఈ వీడియో చూసిన చాలా మంది ఫిదా అవుతున్నారు.ఇది చేసిన ఈ పనులన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
కొందరు మాత్రం పాపం ఇది మనిషి చెప్పినట్లు చేయలేక బాగా ఇబ్బంది పడుతుందని కామెంట్ చేశారు అయితే ఈ కుక్క జాతి కష్టపడడానికి, ఛాలెంజింగ్ టాస్క్‌లు చేయడానికి బాగా ఇష్టపడతాయని మరికొందరంటున్నారు.
ఏదేమైనా ఈ వీడియోలోని ఆ కుక్క పనితనానికి చప్పట్లు కొట్టాల్సిందే అని ఇంకొందరు అంటున్నారు.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?