గిటార్ వాయించేందుకు కుక్క ఆసక్తి., వేదికపైకి వచ్చి..!

మనుషులు, కుక్కల మధ్య బంధం ఈనాటిది కాదు.వాటిని ప్రేమగా చూస్తే అవి ఏనాటికైనా తమ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటాయి.

యజమాని పట్ల అవి చూపించే ప్రేమను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.వాటికి నచ్చిన వారి పట్ల అవి చూపించే విశ్వాసం కూడా మరే జీవి చూపించలేదు.

తాజాగా కుక్కకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

ఆ వీడియో చూస్తే మీరూ కుక్క ఆసక్తి పట్ల ఆసక్తి కనబరుస్తారు.ఊర కుక్కకు సంబంధించిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటుంది.

ఓ బార్ లో మ్యూజిక్ కార్యక్రమం జరుగుతోంది.అక్కడ ఓ కళాకారుడు గిటార్ వాయిస్తూ లయ బద్ధంగా పాట పాడుతున్నాడు.

అప్పుడే అక్కడికి ఓ ఊర కుక్క వచ్చింది.అక్కడికి వచ్చి ఆ గిటార్ వాయిస్తున్న వ్యక్తినే చూస్తూ మ్యూజిక్ ను ఆస్వాదించడం మొదలు పెట్టింది.

ఆ మ్యూజిక్ తనకు నచ్చింది అన్నట్లుగా తోక ఊపుతూ కూర్చుంది.కాసేపటికి అది కాస్త.

గిటార్ వాయించే వ్యక్తి వద్దకు వచ్చింది.అతను నెమ్మదిగా దానిని నిమిరాడు.

గిటార్ వాయించే వ్యక్తి తనను ఏమీ అనకపోవడంతో అది గిటార్ వాయిస్తా అన్నట్లుగా చేయి చాచింది.

దాంతో ఆ వ్యక్తి కుక్క కాలితో గిటార్ వాయించాడు.  ఇప్పుడు ఈ కుక్కకు చెందిన వీడియో సోషల్ మీడియాలా తెగ హల్ చల్ చేస్తోంది.

చూసిన ప్రకీ ఆశ్చర్యపోతున్నారు.ఏంటి బయ్యా ఇది భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.