ఆహారం దొంగలిస్తూ దొరికిపోయిన కుక్క… వీడియో వైరల్!

పెంపుడు కుక్కలు చేసే చిలిపి పనులు వీడియోలు నెట్టింట ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కుక్కకు సంబందించిన వీడియో కూడా నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో చూస్తే మీరు కూడా క్యూట్ అని అనకుండా ఉండలేరు.అంత క్యూట్ గా ఉంది ఆ వీడియో.

అసలు ఆ వీడియోలో ఏముంది అంటే.సాధారణంగా మన పెంపుడు కుక్కలకు మనం స్వేచ్ఛ ఎక్కువ ఇస్తాం.

అలా ఎంతో ప్రేమించే కుక్కలను ఇల్లంతా తిరిగే స్వేచ్ఛను ఇస్తాం.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ యజమాని తన గోల్టెన్‌ రిట్రీవర్‌ కుక్కకు ఆహారం పెట్టడం మర్చిపోయాడు.

దీంతో ఆ కుక్క తన ఆహారం కోసం కిచెన్ కి వెళ్లి టేబుల్ పైన ఉన్న బాక్స్ ఎలాగోలా కష్టపడి తీసుకుంది.

ఇంతలోనే ఆ కుక్క బాక్స్ నోటితో తీసుకొని వస్తుండగా పాపం ఆ కుక్క యజమానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.

ఏం చేస్తున్నావు అంటూ కాస్త గొంతు పెద్దది చేసి అరవడంతో ఆ కుక్క బాక్స్ ని అక్కడ వేసి ముభావంగా వెళ్ళిపోయింది.

ఇది వీడియో తీసిన యజమాని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అందరికి నచ్చేసింది.

వీడియో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!