కోడి కోడీ నడుమ శునకం..రెండు కోళ్లు కొట్లాడుకుంటుంటే వాటిని విడదీయడానికి ఈ కుక్క ఎలా ప్రయత్నించిందో చూడండి

నారీ నారీ నడుమ మురారి లా.కోడీ కోడీ నడుమ కుక్క.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.రెండు కోళ్ల మధ్య ఎందుకు గొడవొచ్చిందో కానీ పందెం వేసుకున్నట్టు పోట్లాడుకోవడం స్టార్ట్ చేశాయి.

పక్కనే ఉన్న కుక్క ఆపండి,ఆపండీ అంటూ వాటిని , విడదీసేందుకు ప్రయత్నించింది.

ఎలా అయితే మనుషులు గొడవపడుతుంటే మధ్యలో మరో మనిషి వెళ్లి పక్కకు లాక్కోస్తుంటాడో అలా ఒక కోడి తోకను పట్టుకుని లాగే ప్రయత్నం చేసింది,మరో కోడి కాళ్లు నోట కరుచుకుని వేరు చేయాలని చూసింది.

ఆ కోళ్లు కుక్కని పట్టించుకోకుండా పోట్లాడుకుంటూనే ఉన్నాయి.ఫాఫం కుక్క.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సామాజిక మాధ్యమాల్లో ఐబీసీ తమిళ్ పేరిట ఇది విడుదల కాగా, చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఇది జరిగినట్టు సమాచారం.మురళీ‌ధర్ అనే జంతు ప్రేమికుడు కోళ్లు, పిల్లులు, కుక్కలను పెంచుతుండగా, ఆయన అధీనంలోని రెండు కోళ్లు కొట్లాడుతుంటే, ఓ కుక్క వాటిని విడదీసేందుకు ప్రయత్నిస్తోంది .

ఆ వీడియోను మీరూ చూడండి.

ఎన్ఆర్ఐ పెట్టుబడులే లక్ష్యం .. భారీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు మధ్యప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు