డెలివరీ త‌ర్వాత పొట్ట త‌గ్గ‌డానికి బెల్ట్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచీ గర్భాశయంతో పాటు పొట్ట కండరాలు కూడా బాగా సాగుతాయి.

అయితే డెలివ‌రీ అనంత‌రం గర్భాశయం యధా స్థానంలోకి వెళ్లి పోతుంది.కానీ, పొట్ట మాత్రం త‌గ్గ‌దు.

అందుకే చాలా మంది మ‌హిళ‌లు ప్రసవానంతరం పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం కోసం బెల్టును వాడుతుంటారు.

అస‌లు బెల్డు వాడితే పొట్ట త‌గ్గుతుందా? అని ప్ర‌శ్నిస్తే.త‌గ్గ‌ద‌నే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిజానికి బెల్టు వాడడం వల్ల సాగిన కండరాలు టైట్‌గా మార‌డం గానీ, పొట్ట తగ్గిపోవడం కానీ జ‌ర‌గ‌వు.

పైగా బెల్డ్ వాడ‌టం మానేశాక పొట్ట‌ మ‌ళ్లీ వ‌ద‌లుగానే మారిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రి బెల్టుతో ఫ‌లితం లేన‌ప్పుడు పొట్ట త‌గ్గించుకునేందుకు ఏయే నియ‌మాలు పాటించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి ,నీరు డెలివ‌రీ త‌ర్వాత పొట్ట త‌గ్గ‌డానికి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఒక గ్లాస్ వాట‌ర్‌తో స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నాన బెట్టుకుని.

ఉద‌యాన్నే సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే సాగిన కండ‌రాలు టైట్‌గా మారి పొట్ట‌ క్రమ‌క్ర‌మంగా త‌గ్గుతుంది.

అదే స‌మ‌యంలో మెంతి నీరును తీసుకుంటే పాల ఉత్ప‌త్తి రెట్టింపు అవుతుంది. """/" / చాలా మంది మ‌హిళ‌లు ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్పుడే బాదం ప‌ప్పులు తీసుకుంటారు.

కానీ, ప్ర‌స‌వం త‌ర్వాత కూడా బాదంను తీసుకుంటే అందులోని ప‌లు పోష‌కాలు వ‌ద‌లుగా మారిన పొట్ట‌ను బిగుతుగా మారుస్తాయి.

అలాగే డెలివ‌రీ త‌ర్వాత పొట్ట‌కు మ‌సాజ్ ఎంతో అవ‌స‌రం.ముఖ్యంగా ఆలివ్ ఆయిల్‌కు కోకో బటర్‌ను క‌లిపి పొట్ట‌కు మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా రోజూ చేస్తే పొట్ట త‌గ్గ‌డ‌ట‌మే కాదు.స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

డెలివరీ త‌ర్వాత చాలా మంది పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటారు.దాంతో పొట్ట మ‌రింత పెరుగుతుంది.

అందుకే డెలివరీ అయిన నాలుగైదు వారాల‌ త‌ర్వాత ఇంటి ప‌నులు చేసుకోవ‌డం, వాకింగ్ వంటివి చేస్తే పొట్ట మామూలు స్థితికి చేరుకుంటుంది.

ఇక డైట్‌లో తాజా ఆకుకూర‌లు, పండ్లు, కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి.

అనుష్క శర్మ , విరాట్ బాడీగార్డ్ శాలరీ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవాల్సిందే!