వి వి వినాయక్ కి ఇప్పుడు ఆ సినిమా చేసేంత దమ్ము ఉందా..?
TeluguStop.com
ఆది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ వి వి వినాయక్( VV Vinayak ).
ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఈయన లాంటి డైరెక్టర్ మరొకరు లేరు అనేంతలా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడమే కాకుండా తనదైన రీతిలో మంచి సక్సెస్ లను కూడా ఇచ్చి వాళ్లను స్టార్లు గా మలచడం లో చాలావరకు హెల్ప్ చేశాడు.
"""/" /
ఇక మొత్తానికైతే ఈయన సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎన్టీఆర్ తో చేసిన అదుర్స్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.
అయితే ఎన్టీఆర్( Jr Ntr ) ఈ సినిమాలో చారి పాత్రలో చాలా అద్భుతంగా నటించారనే చెప్పాలి.
ఇక ఆయనను మించి ఆ పాత్రలో నటించే నటులు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ఆ పాత్ర అంతలా ఎలివెట్ అవ్వడానికి ముఖ్య కారణం వినాయక్ అనే చెప్పాలి.
"""/" /
అయితే ఇప్పుడు అదుర్స్ 2( Adhurs 2 ) సినిమాని చేస్తున్నాం అంటూ కోన వెంకట్ రీసెంట్ గా ఒక అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చాడు.
కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అనే చిన్న మెలికను కూడా పెట్టాడు.
ఇంకా ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తారని చెప్పాడు.కానీ ఇప్పుడు ఆ సినిమాను డీల్ చేసే అంత దమ్ము వినాయక్ కి లేదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ స్టార్ట్ డమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా పెరిగిపోయింది.
కాబట్టి ఆయన స్టార్ డమ్ మ్యాచ్ చేసేలా వినాయక్ సినిమా చేయడం చాలా కష్టమని కూడా అంటున్నారు.
డాకు మహారాజ్ మూవీలో తన నటనతో మెప్పించిన ఈ చిన్నారి ఎవరో మీకు తెలుసా?