ఈ దూకుడు జ‌గ‌న్‌కు క‌లిసొస్తుందా..?

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తన మార్కును చూపించాడు.

తన తండ్రి కోసం మరణించిన వారిని ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర చేసి కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్నారు.

అనంతరం అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్నా సరే బెదరలేదు.తాను స్థాపించిన వైఎస్సార్ సీపీ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.

2014లో అధికారం దక్కకపోయినా కానీ ఏ మాత్రం బెదరకుండా నిలబడ్డారు.2019లో ఎవరూ ఊహించని రీతిలో అధికారాన్ని చేజిక్కించుకుని సత్తా చాటారు.

అప్పటి నుంచి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇన్నాళ్లు టీడీపీతో ఎక్కువగా వైరం పెట్టుకోని జగన్ ఇప్పుడు మాత్రం రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు.

ఎలాగైనా సరే టీడీపీని రాష్ర్టంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.దానికి రాష్ట్రంలో ప్రస్తుతం జరిగే సంఘటనలే ఉదాహరణలుగా చెప్పొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పట్టాభి ఇష్యూను సీరియస్ గా తీసుకున్న వైసీపీ అతడిని ఊచలు కూడా లెక్కబెట్టించింది.

ఎలాగైనా సరే టీడీపీని అణచివేయాలని జగన్ కేబినేట్ సమావేశంలో తన మంత్రులకు చెప్పినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ గత రికార్డులతో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు పోల్చి చూస్తే వైసీపీ దూకుడు పెంచినట్లుగానే కనిపిస్తోంది.

టీడీపీ నేతల కారుపై వైసీపీ శ్రేణుల దాడి దగ్గరి నుంచి, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించడం, ఇప్పుడు పట్టాభి మ్యాటర్ అన్నీ వెరసి వైసీపీ దూకుడు పెంచిందనే సంకేతాలనే వెలువర్తుస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కానీ ప్రజల దృష్టి మాత్రం టీడీపీ చేస్తున్న ఆరోపణలపైకే మళ్లుతోందనే పలువురు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైన టీడీపీ ఇలా వ్యవహరించడం జగన్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.

వైరల్ వీడియో: రోమాలు నిక్కపరిచేలా టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రోమో..