దేవర ట్రైలర్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

'స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు' గారి దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వరుస సినిమాలను చేస్తూ వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని పెంచుకుంటూ వచ్చినవారే కావడం విశేషం.

అలాగే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న 'దేవర ' సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

"""/" / ఇక ఈనెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ( Devara Trailer )రాబోతున్నట్టుగా కూడా మేకర్స్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు.

మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే ప్రస్తుతం ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ ప్రేక్షకుడిని ఏమాత్రం అలరించకపోగా ట్రైలర్ తో అయిన కనీసం ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి అనే ధోరణిలో అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి ట్రైలర్ కనక అద్భుతంగా ఉంటే మాత్రం సినిమా మీద భారీ అంచనాలైతే పెరుగుతాయి.

"""/" / లేకపోతే మాత్రం సినిమా మీద అంచనాలు తగ్గడమే కాకుండా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలైతే లేకుండా పోతాయి.

ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ కనక అద్భుతంగా ఉన్నట్టైతే ఈ సినిమాకి భారీ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే దక్కుతాయి.

లేకపోతే మాత్రం ఈ సినిమా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

గణపతి బప్పా మోరియా అంటున్న బంగ్లా క్రికెటర్..