మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?: హరీశ్ రావు

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS)నేత హరీశ్ రావు(Harish Rao) అన్నారు.

గత ఐదు నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు.టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన లేకుండా ఆర్ అండ్ బీ (R&B)శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమని హరీశ్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పేదలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే త్వరితగతిన ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

పాలస్తీనాకు అనుకూలంగా వ్యాసం.. అమెరికాలో భారతీయ విద్యార్ధిపై సస్పెన్షన్ వేటు