తెలంగాణలో బీసీ మంత్రం.. పని చేస్తుందా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోలిటికల్ హీట్ పెరుగుతోంది.ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో కుల సమీకరణలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు.తెలంగాణలో ఏదైనా పార్టీ విజయం సాధించాలంటే బీసీ, దళిత ఓటర్ల పాత్ర కొంత ఎక్కువే అని చెప్పాలి.

దాదాపు 30 ఓటు షేర్ ఈ సామాజిక వర్గాల నుంచే వస్తుంది.అందుకే ఈ వర్గ ప్రజలను ఆకర్శించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

"""/" / బి‌ఆర్‌ఎస్( Brs Party ) అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పెద్దగా ఒరిగిందేమీ లేదని.

వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే ఈ సామాజిక వర్గాలలో పురోగతి తీసుకొస్తామని హస్తం నేతలు చెబుతున్నారు.

వచ్చే నెలలో భారీగా బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్దమౌతోంది కాంగ్రెస్ పార్టీ.

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికే అధిక సీట్లు కేటాయించేలా టి కాంగ్రెస్( Telangana Congress ) ప్లాన్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎత్తుకున్న బీసీ మంత్రానికి చెక్ పెట్టెలా అధికార బి‌ఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది.

"""/" / హస్తం పార్టీ బీసీలకు చాలా అన్యాయం చేసిందని, కాంగ్రెస్( Congress Party ) ను నమ్మితే బీసీలు నట్టేట మునుగినట్లే అంటూ విమర్శలు చేస్తున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను కాంగ్రెస్ అవమానిస్తోందని, బీసీ నేతలను విమర్శిస్తే ఉరుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.

త్వరలోనే బీసీలను ఏకం చేసేందుకు కార్య చరణ సిద్దం చేస్తున్నామని కూడా తెలిపారు.

దీన్ని బట్టి చూస్తే అటు కాంగ్రెస్ గాని ఇటు బి‌ఆర్‌ఎస్ గాని బీసీ సామాజిక వర్గంపై గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

బీసీ ఓటు బ్యాంక్ ను కొల్లగొడితే అధికారం సాధించడం నల్లేరు మీద నడకే అని ఈ రెండు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకున్న ఈ బీసీ మంత్రం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.

ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్న గద్వాల ఎమ్మెల్యే ..రేవంత్ తో భేటీ