తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి కొత్త పుంతల తొక్కుతుంది.నిజానికి మన దర్శకులు కొత్త కథలతో సినిమాలు చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం ఇప్పుడు దేవాలయాలను( Temples ) బేస్ చేసుకొని ఎక్కువ సినిమాలను చేస్తున్నారు.
ఇక మీదట రాబోయే సినిమాలు కూడా ఎక్కువగా దైవభక్తితో నిండి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కాంతార( Kantara ) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న రిషబ్ శెట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.
ఎందుకంటే దైవభక్తిని చూపిస్తూ దేవుడి యొక్క పవర్ ఎలా ఉంటుందో తెలియజేసే సినిమాలను రాసుకుంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నారు.
"""/" /
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా వచ్చి సక్సెస్ లను సాధించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికే తెలుగులో 'మహేంద్రగిరి వారాహి'( Mahendragiri Varahi ) లాంటి అమ్మవారి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ఇక ఈ సినిమాతో పాటుగా సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) చేస్తున్న కొత్త సినిమా కూడా దేవుడి మీద బేస్ చేసుకొని ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేవుళ్ళ సినిమాలు ఎక్కువైపోతున్నాయనే చెప్పాలి.
"""/" /
ఇప్పుడు సినిమాల్లో దైవభక్తితో కూడిన ట్రెండ్ అయితే నడుస్తుంది.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది.
అందుకే పెద్ద హీరోలు కూడా ఈ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాలు ప్రేక్షకుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి అనేది.
నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?