రేవంత్ పై షర్మిలకు ఆ స్థాయి కోపం ఉందా?

తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, అత్యంత భారీ పాదయాత్ర చేసిన వైఎస్ ఆర్ టి పి( YSRTP ) అధ్యక్షురాలు షర్మిల కష్టం చివరికి వృధా ప్రయాస అయిపోయింది.

కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో విలీనం దిశగా దీర్ఘకాల చర్చలు నడిచాయి కానీ విలీనం సఫలం అవలేదు .

మరి షర్మిల షరతులకు కాంగ్రెస్ ఒప్పుకోలేదో లేక కాంగ్రెస్ షరతులకు షర్మిల ఒప్పుకోలేదో తెలియలేదు కానీ చివరకు విలీనం ప్రక్రియ మాత్రం నిలచిపోయింది .

మరోపక్క ఎన్నికలకు సిద్ధమవటానికి సమయం కూడా సరిపోకపోవడంతో తెలంగాణ ఎన్నికల లో పోటీ నుంచి దూరంగా ఉంటున్నట్టు షర్మిల ప్రకటించింది.

ప్రభత్వ వ్యతిరేక వోటు చీలకూడదని బావిస్తున్నామని , కాంగ్రెస్ కు బేషరుతు గా మద్దతు ఇస్తున్నామని వైఎస్ఆర్ టిపి అభిమానులు, కార్యకర్తలు కాంగ్రెస్కు ఓటు వేయవలసిందిగా ఆమె పిలుపునిచ్చారు.

అయితే తన మద్దతు కాంగ్రెస్ పార్టీకే కానీ రేవంత్ రెడ్డికి కాదన్నట్లుగా ఆమె నిన్న మీడియా సమావేశం సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.

"""/" / అన్ని పార్టీలలోనూ దొంగలు ఉంటారని అలాంటి దొంగలు ముఖ్యమంత్రి కాకూడదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవే అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై కేసులు సుప్రీంకోర్టు ఇంకా కొట్టేయలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ద్వారా, కేసులు ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కాకూడదని ఆమె బావిస్తున్నట్టు తెలుస్తుంది .

ముఖ్యంగా తన పార్టీ విలిన ప్రక్రియను అడుగడుగునా అడ్డుకొని చివరకు తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డం పడ్డాడనే కోపంతోనే రేవంత్ పై షర్మిల ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా మరొకరిని ఎన్నిక చెయ్యదానికి ఈ కేసుల గొడవ కాంగ్రెస్ సీనియర్ లకు అస్త్రం గా పనిచేసే అవకాశం కనిపిస్తుంది .

"""/" / ఏది ఏమైనా ఒకవైపు బేషరతు మద్దతు ఇస్తూనే మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుని తిట్టడం ద్వారా షర్మిల చాలా భిన్నమైన ధోరణి ప్రకటించారని చెప్పవచ్చు.

పోటీ నుండి విరమించుకున్న ఒత్తిడి ఆమె ఇలా మాట్లాడేలా చేస్తుందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు .

భారతీయుడు2 సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. భోలేషావలి కామెంట్స్ వైరల్!