నగరిలో సెంటిమెంట్ అస్త్రం ఫలిస్తుందా..???

నగరి అంటే తెలియని వారెవరూ ఉండరు.ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఏకైక పేరు రోజా.

గతంలో టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దు కృష్ణమపై స్వల్ప మెజారిటీతో గెలిచినా, 2014 ఎన్నికల్లో ముద్దు కృష్ణమ కి కంచుకోటగా ఉన్న నగరిలో రోజా పాగా వేసేసింది.

అయితే ఒక్క సారిగా ముద్దు కృష్ణమ చనిపోవడంతో నగరి రాజకీయాలు మారిపోయాయి.ఇక తన హవా నగరిలో ఉంటుందని భావించిన రోజాకి టీడీపీ అధినేత ముద్దు కృష్ణమ తనయుడు భాను కి కీలక భాద్యతలు అప్పగించి నగరి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెట్టారు.

దాంతో నగరిలో రాజకీయం వేడెక్కింది.తనకి తిరుగులేదని అనుకున్న రోజాపై ,చంద్రబాబు అందరూ ఊహించినట్టుగానే సెంటిమెంట్ అస్త్రంగా ముద్దు కృష్ణమ తనయుడిని దించడంతో నగరిలో రోజా గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరి నుంచీ గెలుపొందేది ఎవరు.?? నగరిలో ముద్దు కృష్ణమ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.

?? మళ్ళీ వైసీపీ నుంచీ రోజా గెలుస్తుందా అనే విషయాలని ఒక్క సారి పరిశీలిస్తే.

సినిమా నటిగా , బుల్లి తెరపై కూడా తనదైన శైలిలో ప్రజాభిమానం సంపాదించుకున్న నటిగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ప్రజలకి ఎంతో చేరువగా ఉన్న వ్యక్తిగా అభిమానం సంపాదించుకున్న రోజా మరో సారి ఎన్నికల్లో నగరి నుంచీ బరిలోకి దిగుతున్నారు.

మరో పక్క గాలి ముద్దు కృష్ణమ సెంటిమెంట్ తో ఆయన తనయుడు భాను కూడా అదే స్థానం నుంచీ బరిలోకి దిగుతున్నారు.

ఇదిలాఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్నా సరే తన నియోజకవర్గ ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తాగు నీటి సమస్య ప్రాంతాలలో బోర్లు వేయించడం, స్కూల్స్ లో మౌళిక వసతులు కల్పించడం, వైఎస్ ఆర్ పేరిట ఉచిత అన్నదానం నిర్వహించడం.

యువత కోసం ఉద్యోగ కల్పన ఇలా ఎన్నో కార్యక్రమాలు రోజా ట్రస్ట్ ద్వారా చేపట్టారు.

ఇప్పుడు ఇదే ఆమెని ప్రజల నుంచీ విడదీయలేని భంధంగా అల్లుకుపోయింది.ఇక పొతే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గాలి భాను ప్రకాష్ రెడ్డి తన తండ్రి మరణం అనంతరం కీలకంగా మారారు, పార్టీ క్యాడర్ ఎక్కడా పోగొట్టుకోకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు.

తండ్రి మరణం అనంతరం సానుభూతి కూడా ఈ కుటుంభం పై చూపించారు ప్రజలు.

అయితే కుటుంభం ఇద్దరు అన్నదమ్ములు టిక్కెట్లు విషయంలో పోటీ పడటంతో నగరి ప్రజల ముందు చులకన అయ్యారు కూడా, గాలి ప్లేస్ ని ఆయన కుటుంభం భర్తీ చేయలేకపోతోంది అనే కామెంట్స్ కూడా తరుచు వినిపిస్తూ ఉంటాయి.

అయితే ఇప్పటికి గాలిపై ఉన్న అభిమానం, ఆ సెంటిమెంట్ భాను గెలుపుకి కాస్తో కూస్తో కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

అంతేకాదు మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కూడా భాను ప్రకాష్ కి మెండుగా ఉందని నగరి నుంచీ భాను గెలుపు పక్కా అనేది స్థానిక టీడీపీ నేతల అభిప్రాయం.

అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో భానుప్రకాష్ కంటే కూడా రోజా గెలుపుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ పండితులు.

ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉండి ప్రభుత్వం సాయం రాకపోయినా తన ట్రస్ట్ ద్వారా ప్రజల కనీస అవసరాలు తీర్చడంతో రోజా ప్రజాభిమానం మెండుగా పొందారని ఈ కారణాల వలెనే రోజా మళ్ళీ నగరి ప్రజల అభిమానం మరో సారి అందుకోనున్నారని తెలుస్తోంది.