‘జనసేన ‘కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ? 

ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ( Janasena Party ).వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని దీనికోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

దీనిలో భాగంగానే టిడిపి తోనూ పొత్తు పెట్టుకుని జనసేన , టిడిపి,  బిజెపిలు( TDP, BJP ) కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు.

ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతానికి టిడిపి,  బిజెపితో పొత్తు కొనసాగిస్తున్నా.  భవిష్యత్తులో జనసేన ఒంటరిగానైన ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.

"""/" / 2014లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతోమంది ఉన్నారు .

 అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది.2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా నిరాసే ఎదురయింది.

  కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించడంతో జనసేన ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదని , ఆ పార్టీలో ఉన్నా తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో చాలామంది నాయకులు జనసేనకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయారు.

మరి కొంతమంది ఇతర పార్టీలలో చేరిపోయారు.ఎంత పెద్ద నాయకులు పార్టీ పైన విమర్శలు చేసి బయటకు వెళ్లినా,  పవన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

పార్టీని వీడుతున్న వారి గురించి ఏమాత్రం టెన్షన్ పడలేదు.  ఉన్న నేతలతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఉంటూ వచ్చారు.

  ప్రస్తుతానికి అధికార పార్టీలో భాగస్వామ్యంగా జనసేన ఉన్నా .రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలి.

పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమంచే విషయంలోనూ పవన్ అంతగా పట్టించుకోలేదు.

"""/" / ఇప్పుడు జనసేన పరిస్థితి వేరు .వచ్చే ఎన్నికల నాటికి జనసేన మరింత క్రియాశీలకంగా మారుతుంది.

  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి మండల,  నియోజకవర్గ , రాష్ట్రస్థాయి కమిటీలను నియమించుకుని బలమైన పార్టీగా జనసేనను  తీర్చిదిద్దాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ఫోకస్ చేశారు .తొమ్మిది లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అర్హ పుట్టినరోజు.. వైరల్ అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!