ప్రజాకోర్టు అంటే ఏంటో పవన్ కు తెలుసా..?: ఎమ్మెల్సీ పోతుల సునీత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు ఉందా అని ప్రశ్నించారు.

జనసేనాని తన భార్యలకి ఇచ్చిన గౌరవం ఏంటో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసని ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు.

మహిళల పుట్టుకనే అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును పట్టుకుని పవన్ తిరుగుతున్నాడని విమర్శించారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే పవన్ పడే తాపత్రయాన్ని కాపు జాతి క్షమించదని తెలిపారు.

ప్రజా కోర్టు నిర్వహిస్తామన్న ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ అసలు ప్రజాకోర్టు అంటే ఏంటో పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు.

ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)