నేడు జరిగే ఇండియా-పాక్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్‌కు ఉందా..?!

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఇవాళ అంటే అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

దీంతో ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పాక్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ కూడా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంటుంది.

ఈరోజు జరగబోయే మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకు జాబితాలో తొలి స్థానంలో ఇంగ్లాండ్ ఉండగ .

రెండో స్థానంలో భారత్.మూడో స్థానంలో పాకిస్థాన్ జట్లు ఉన్నాయి.

దీంతో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండనుందని స్పష్టం అవుతోంది.భారత జట్టులోని బ్యాట్స్‌మెన్, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారనేది నిజం.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇలా మన టీంలో మంచి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారు.

జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌ ఫాస్ట్ బౌలింగ్ లో నంబర్ వన్ గా నిలుస్తున్నారు.

స్పిన్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బలంగా ఉన్నారు.

దీన్ని బట్టి పాకిస్థాన్ జట్టు ఇండియా నుంచి దీటైన పోటీని ఎదుర్కొవచ్చునని చెప్పుకోవచ్చు.

ఇక పాకిస్థాన్ జట్టు విషయానికి వస్తే.కెప్టెన్ బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ విషయంలో బాగా రాణించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆ దేశం అభిమానులంతా వీరి పైనే ఆశలు పెట్టుకున్నారు.అయితే ఆదివారం జరిగే మ్యాచ్​లో గెలిచి చరిత్ర తిరగరాస్తామని బాబర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో లక్ష్య చేధనతో బరిలోకి దిగిన జట్లు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి.

నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు దిగిన టీమే గెలవడానికి అవకాశాలెక్కువ.ఈ క్రమంలో టాస్ గెలవడం అత్యంత కీలకంగా మారింది.

"""/"/ పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.

పాకిస్తాన్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగితే.అందులో ఏడు మ్యాచ్‌లలో ఇండియానే విజయం సాధించింది.

ఈసారి కూడా మన భారత్ యే గెలవచ్చు అని చాలామంది అంచనా వేస్తున్నారు.

ఈ మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటల 30నిమిషాలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమ్ అవుతుంది.

"""/"/ టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉండనున్నారు.

పాకిస్థాన్‌ జట్టులో బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(wk), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ఆడనున్నారు.

అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్..: మోదీ