మహేష్ బాబుకి అలాంటి వ్యసనం ఉందా… స్వయంగా చెప్పేసిన మహేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu) గురించి చెప్పాల్సిన పనిలేదు.

అందరికీ వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం అందుకు విరుద్ధం.

ఈయనకు వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు అయితే ఈయన ఇలా అందంగా కనిపించడానికి కారణం ఆయన ఫుడ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలనే చెప్పాలి.

మహేష్ బాబు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటారు.

అలాగే భారీ స్థాయిలో వర్కౌట్స్ కూడా చేస్తుంటారు. """/" / ఇలా ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే మహేష్ బాబుకి ఒక చెడు అలవాటు ( Bad Habbit ) కూడా ఉందట.

ఇలా ఎంతో హ్యాండ్సమ్ గా హెల్తీగా కనిపించే మహేష్ బాబుకి ఉన్నటువంటి చెడు అలవాటు ఏంటా అని ఆలోచిస్తున్నారా అదేనండి స్మార్ట్ ఫోన్.

మహేష్ బాబుకి స్మార్ట్ ఫోన్ ( Smart Phone) కనిపిస్తే చాలు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ లో లీనం అవుతూ ఉంటారని తాజాగా మహేష్ బాబు వెల్లడించారు.

మల్టీ స్టోర్స్ కంపెనీ 'బిగ్ సీ'( Big C ) 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్‌గా మహేష్ బాబు సందడి చేశారు.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టర్ మహేష్ బాబుని ప్రశ్నిస్తూ మీరు స్మార్ట్ ఫోన్ ఎంతసేపు ఉపయోగిస్తారు అంటూ ఆయనకు ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ అందరిలాగే తాను కూడా మొబైల్ ఫోన్ గంటల తరబడి వాడుతూ ఉంటానని తెలిపారు.

తనకు ఉదయం లేచినప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఉండాలని తెలిపారు.ఇలా మొబైల్ ఫోన్ గంటల తరబడి చూడటం వల్ల కొన్ని సార్లు తలనొప్పి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటానని మహేష్ తెలిపారు.

అయితే ఈ అలవాటు నుంచి తాను బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడలేకపోతున్నాను అంటూ మహేష్ తనకు ఉన్నటువంటి చెడు వ్యసనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చరణ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఫిక్స్.. అలా ఉండబోతుందా?