కేసిఆర్ లో నాటి జోష్ ఏది ?
TeluguStop.com
కేసిఆర్ అంటేనే మాటల తుటాలు, ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే విమర్శలు, చెవులు రిక్కరించి వినేలా ప్రసంగాలు.
ఇలా కేసిఆర్ సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు.మరి ఎన్నికల ముందు అంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
2018 ఎన్నికల ముందు ఒన్ మ్యాన్ షో గా సుడిగాలి పర్యటనలు, ప్రత్యర్థులకు దడ పుట్టించే ప్రసంగాలు చేసిన కేసిఆర్.
( CM Kcr ).2023 ఎన్నికలు వచ్చేసరికి ఆ జోష్ కరువైందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన సుడిగాలి పర్యత్నాలు చేస్తున్నప్పటికి మునుపటి జోష్ లేదనే మాట వినిపిస్తోంది.
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్దిని బలంగా ప్రజల్లో ప్రస్తావించడంలో కేసిఆర్ వెనకడుగు వేస్తున్నారని కొందరు రాజకీయ అతివాదులు చెబుతున్నారు.
"""/" /
ప్రస్తుతం ఆయన ప్రసంగాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీని ( Congress Party )లక్ష్యంగా చేసుకొని విమర్శలు గ్బుప్పిస్తున్నారే తప్పా.
మళ్ళీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు.
పైగా తమకు అధికారం ఇవ్వకపోతే ప్రజలే నష్టపోతారని, తమకు అధికారం ఇవ్వకపోతే వచ్చే నష్టమేమీ లేదని.
ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.దీంతో ఈసారి గెలుపు విషయంలో కేసిఆర్ కు డౌట్ గానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ముఖ్యంగా ఈ ఐదేళ్లలో కేసిఆర్ పాలనపై సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా గట్టిగానే వినిపిస్తూ వస్తోంది.
ఇదే సమయంలో హస్తం పార్టీ కూడా బలం పెంచుకోవడంతో కేసిఆర్ కు ఈసారి ఓటమి భయం పట్టుకుందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
"""/" /
ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయా సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం బిఆర్‌ఎస్ పార్టీకే( BRS Party ) ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
అయినప్పటికి కేసిఆర్ మాత్రం గెలుపు విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా లేరనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట.
ఎందుకంటే కాంగ్రెస్ కు కూడా ఈసారి ఓటు షేర్ బాగానే పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
దీంతో రెండు పార్టీల మద్య టాఫ్ ఫైట్ నెలకొనే అవకాశాలే ఎక్కువ.దానికి తోడు వైఎస్ఆర్ తెలంగాణ, వామపక్షాలు, టీడీపీ.
వంటి ఇతర పార్టీల మద్దతు కూడా కాంగ్రెస్ కు ఉండడంతో హంగ్ ఏర్పడిన అది కాంగ్రెస్ కే ప్లేస్ అవుతుందనే భయం బిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల దృష్ట్యా కేసిఆర్ లో మునుపటి కాన్ఫిడెంట్ లోపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!