రచ్చ గెలవడం తర్వాత.. ముందు ఇంట గెలవగలరా కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు.దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో రాణించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

కేంద్రం ఆ పని చేయలేదు.ఇది చేయలేదు అంటూ కేసీఆర్‌తో సహా కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ నేతలు పదే పదే కేంద్ర వైఫల్యాల మీద తరచూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే విమర్శ చేసే హక్కు అందరికీ ఉంటుంది.కానీ ఒక వేలు ఎదుటివారిపై చూపిస్తే.

మిగతా నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయనే సంగతి గుర్తుంచుకోవాలి.అందుకు ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్తుంటారు.

ముందు సొంత రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

ఈ విషయాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రతి నెల క్యాలెండర్‌లో పదో తారీఖు దాటినా కూడా తెలంగాణలో హోంగార్డులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.

ఇది సరిపోదు అన్న తరహాలో ఇటీవల వరుసగా రాష్ట్రంలో పబ్ కేసులు, డ్రగ్స్ కేసులు, రేప్ కేసులు ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి.

రెండు రోజులుగా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉధృతం అవుతోంది.

దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు క్యాంపస్ బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చినా విద్యార్థులు నమ్మడం లేదు. """/"/ తమ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలని.

అప్పుడు మాత్రమే తమ ఆందోళనను విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.అయినా ప్రభుత్వానికి విద్యార్థుల మాటలు చెవికి ఎక్కడం లేదు.

మరోవైపు సిద్దిపేట జిల్లాకు చెందిన గౌరవెల్లి భూ నిర్వాసితుల విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు.

అర్థరాత్రి దాటిన తర్వాత ఆందోళన చేస్తున్న వారి ఇళ్లలోకి వెళ్లి చేసిన రచ్చ ఇప్పుడు ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది.

ఒకటి తర్వాత ఒకటి వివాదాలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నా కేసీఆర్ ఇంకా జాతీయ రాజకీయలపై దృష్టి సారిస్తున్నారు.

దీంతో ముందు మీరు ఇంట గెలవగలరా అని కేసీఆర్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారు.