జగన్ స్ట్రాటజీ టిడిపిని భయపేడుతుందా?

నిన్న మొన్నటి వరకూ అధికార వైసిపిని ఎదురుకోవడానికి తమ బలం సరిపోదు అని భావించిన తెలుగుదేశం జనసేనతో కలిసి అధికారాన్ని పంచుకోడానికి సిద్ధమవడం ద్వారా విన్నింగ్ కాంబినేషన్ ఏర్పరిచామన్న దిమాలో ఉండేది.

ఒకరకంగా తెలుగుదేశంలో ఇటీవల జరిగిన పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ వంటి వాటితో వచ్చిన సానుభూతి మరియు ప్రభుత్వ వ్యతిరేకతను చీలకుండా చూసుకోవడం ద్వారా అధికారంలోకి రావచ్చని తెలుగుదేశం అధిష్టానం కొంత ధీమా వ్యక్తం చేసేది .

అయితే వారందరికీ ఇప్పుడు ఇన్చార్జిలను మారుస్తూ జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల కలవరం మొదలైందట , ముఖ్యంగా తమ ఉమ్మడి అభ్యర్థులకు దీటుగా సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికలను టఫ్ ఫైట్ గా మార్చేయబోతున్నాయని టిడిపి అధిష్టానం భావిస్తుందట.

ముఖ్యంగా మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పై లోకేష్ గెలుపు లాంఛనమే అని భావించిన తెలుగుదేశానికి ఇప్పుడు గంజి చిరంజీవి వంటి గట్టి అభ్యర్ర్ధీని తీసుకొచ్చి పెట్టడంతో గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితిని జగన్ సృష్టించారు.

"""/" / ఇప్పుడు అదేవిధంగా చాలా చోట్ల జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులు నిలబడటానికి ఇప్పటికే జగన్ రంగం సిద్ధం చేశారని రానున్న నెల రోజుల కాలంలో పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులతో వైసిపిని జగన్ ప్రక్షాళన చేయబోతున్నారని దాంతో రాబోయే ఎన్నికల లో పోటీ చాలా గట్టిగా ఉండబోతుందని ఈ సారి గెలుపు కోసం తన సర్వశక్తులనుఓడ్డడానికే జగన్ సిద్ధమయ్యారు అని వస్తున్న వార్తలు టిడిపి శిబిరం లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది .

ఆర్థిక అండదండలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులను గెలిపే లక్ష్యంగా పావులు కలపబోతున్నట్లుగా తెలుస్తుంది .

మరి జగన్ ఇచ్చిన షాక్ తో తెరుకుంటున్న తెలుగుదేశం పార్టీ తమవైపు నుంచి కూడా గట్టి అభ్యర్థులు నిలబెట్టే విధంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

అమ్మ సూచనలతో ప్రైవేట్ జెట్ లో షిరిడీకి వెళ్లిన హీరో విజయ్.. ఏం జరిగిందంటే?