ప‌చ్చి వెల్లుల్లి తింటే.. అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌!

ఘాటుగా ఉండే వెల్లుల్లిని త‌ర‌చూ వంట‌ల్లో వాడుతూనే ఉంటారు.చ‌క్క‌టి రుచి, సువాస‌న అందించే వెల్లుల్లి వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ప‌చ్చి వెల్లుల్లితో అధిరు బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌.నేటి కాలంలో మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఒక్క‌సారి బ‌రువు పెరిగారంటే.ఆ త‌ర్వాత త‌గ్గ‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తేగాని బ‌రువు త‌గ్గించుకోలేదు.అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌చ్చి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్ర‌తి రోజు ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మూడు లేదా నాలుగు తీసుకోవ‌డం వ‌ల్ల బరువు త‌గ్గొచ్చ‌ట‌.

ప‌చ్చి వెల్లుల్లి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగిస్తుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.

త‌ద్వారా బ‌రువు త‌గ్గొచ్చు.ప‌చ్చి వెల్లుల్లితో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

"""/" / ప‌ర‌గ‌డుపున ప‌చ్చి వెల్లుల్లిని తేనెతో క‌లిపి తీసుకుంటే.జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతుయి.

మ‌ల‌బ‌ద్ధం, గ్యాస్ వంటి స‌మ‌స్యల నుంచి ఉపశ‌మ‌నం ల‌భిస్తుంది.అలాగే ఈ క‌రోనా టైమ్‌లో వెల్లుల్లిని ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

ఎందుకంటే.వెల్లుల్లి తీసుకోవ‌డం శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

అదే విధంగా, జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వెల్లుల్లి ర‌సం మ‌రియు తేనె క‌లిపి తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక ప్ర‌తి రోజు ఉద‌యం రెండు, మూడు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.

అలాగే మ‌ధుమేహం స‌మ‌స్య ఉన్న వారు ప‌చ్చి వెల్లుల్లిని పేస్ట్ చేసి.గోరు వెచ్చిని నీటిలో క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.మ‌రియు అధిక ర‌క్త‌పోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని.వెల్లుల్లిని అతిగా మాత్రం తీసుకోకూడ‌దు.

Meal : భోజనం చేసిన ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా..!