బ‌రువు పెరుగుతారని పన్నీర్ ను దూరం పెడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

పాల నుంచి తయారు చేయబడిన పదార్థాల్లో పన్నీర్( Paneer ) ఒకటి.పన్నీర్ పాల కంటే రుచిగా ఉంటుంది.

పైగా ధర కూడా ఎక్కువే.అలాగే పన్నీర్ తో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.

పన్నీర్ తో ఏ వంటకం చేసినా రుచి మాత్రం అదిరిపోతుంది.అయితే పన్నీర్ లో కొవ్వు శాతం అధికంగా ఉంటుందని.

దాన్ని తీసుకుంటే బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తుంటారు.ఈ క్రమంలోనే పన్నీర్‌ అంటే ఇష్టం ఉన్న సరే దానిని దూరం పెడుతుంటారు.

"""/"/ మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే.

పన్నీర్ లో ఫ్యాట్స్‌ మాత్రమే కాదు మన ఆరోగ్యానికి అవసరం అయ్యే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి( Vitamin D ) తో సహా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

ఫ్యాట్స్( Fats ) ఉన్నాయి అన్న ఒక్క కారణం చేత పన్నీర్ ను అవాయిడ్ చేస్తే ఈ విలువైన పోషకాలన్నిటిని మనం మిస్ అవ్వాల్సి ఉంటుంది.

అయినా పన్నీర్ ను మితంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు లేవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.

నిపుణులు కూడా బరువు పెరుగుతామన్న భయం లేకుండా పన్నీర్ తీసుకోమని చెబుతున్నారు.పన్నీర్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

దాంతో శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఎముకల బలహీనత( Weak Bones )ను నివారించడానికి పన్నీర్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పన్నీర్ లో పుష్కలంగా ఉండే క్యాల్షియం, విట‌మిన్ డి ఎముకల‌ను దృఢంగా మారుస్తాయి.

ఎముకల బలహీనతను నివారిస్తాయి.పన్నీర్ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసి తక్షణ శక్తినిస్తుంది.

అందుకే చాలామంది డైట్ లో పన్నీర్ ను చేర్చుకుంటారు. """/"/ మధుమేహం వ్యాధిగ్రస్తులు( Daibetic Patients ) కూడా పన్నీర్ తీసుకోవచ్చు.

పన్నీర్ లో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

అంతేకాదు పన్నీర్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

డిప్రెషన్( Depression ) దూరం అవుతుంది.మెదడు చురుగ్గా మారుతుంది.

జుట్టు రాలడం సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

పూజ గదిలో ఈ వస్తువులు ఉండడం అంత మంచిది కాదా..?