కీర తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా..?

కిడ్నీలో రాళ్లు( Kidney Stones ).ఇటీవల కాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి.

ఖనిజాలు మరియు ఉప్పు నిల్వలతో కిడ్నీలో రాళ్లు తయారవుతాయి.అధిక శరీర బరువు, అనారోగ్యకరమైన ఆహారం, కొన్ని సప్లిమెంట్లు మరియు మందుల వాడకం, తక్కువ నీరు తాగడం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతుంటాయి.

కిడ్నీలో రాళ్లు మూత్రనాళంలో ఏ భాగంలోనైనా రావొచ్చు.కిడ్నీల్లో రాళ్లు రావడం బాధాకరమైనది.

అయితే ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే వేగంగా సమస్య నుంచి బయటపడవచ్చు.ఇకపోతే కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా తోడ్పడతాయి.

ఈ జాబితాలో కీర దోసకాయ( Cucumber ) కూడా ఒకటి.కీరాలో అనేక పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

రోజుకు నాలుగు నుంచి ఐదు కీర దోసకాయ స్లైసెస్ ను తీసుకుంటే ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు పొందుతారు.

"""/" / ముఖ్యంగా కీర దోసకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.

కీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మూత్ర సమస్యల‌ను దూరం చేస్తాయి.కీర దోయ‌కాయ‌ను నేరుగా తిన‌డం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా త‌గ్గు ముఖం పడతాయి.

"""/" / అలాగే మధుమేహం( Diabetes ) ఉన్నవారు నిత్యం కీర దోసకాయ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

కీర దోసకాయ బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.

క్యాన్సర్ కణాలను నిరోధించే గుణాలు కూడా కీర దోసకాయకు ఉంటాయి.కీర దోసకాయను నిత్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

అంతేకాదు కీరా దోసకాయ రెగ్యులర్ డైట్ లో ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.చర్మం కాంతివంతంగా మరియు నిగారింపుగా సైతం మారుతుంది.

మరో రికార్డ్ సాధించిన కల్కి 2898 ఏడీ.. ప్రభాస్ దూకుడుకు బ్రేకులు వేయడం కష్టమేనా?