Ram Charan : వామ్మో.. చరణ్ కు అవంటే అంత ఇష్టమా.. ఫస్ట్ రెమ్యూనరేషన్ దానికే పెట్టాడా?

కొందరు ఏదైనా ఇష్టపడితే వాటిని దక్కించుకోవడానికి ఎంత ఖర్చైనా చేయటానికి సిద్ధపడతారు.మామూలుగా మధ్యతరగతి వాళ్ళ విషయాలు పక్కకు పెడితే బాగా ధనవంతులకు మాత్రం తమకు ఏది కావాలి అంటే అది తమే ముందే ఉంటుంది.

ముఖ్యంగా బాగా డబ్బున్న నటులను గమనించినట్లయితే మార్కెట్లోకి ఏదైన బ్రాండెడ్ వి వస్తే చాలు వెంటనే కొనేస్తూ ఉంటారు.

ముఖ్యంగా కార్లు, బ్రాండెడ్ దుస్తువులు, వాచ్ లు ఇలా తమకు సంబంధించినవి ఏవైనా సరే కోనేస్తారు.

అయితే రామ్ చరణ్ కు కూడా ఒక వస్తువు చాలా ఇష్టమని దానికోసం తన ఫస్ట్ రెమ్యూనరేషన్( First Remuneration ) అని కూడా లెక్క చేయకుండా దానికి పెట్టేసాడు అని తెలిసింది.

ఇంతకూ చరణ్( Charan ) కు అంత ఇష్టమైన వస్తువు ఏంటో తెలుసుకుందాం.

తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకొని బాగా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్.

తొలిసారిగా 2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అలా తొలిసారి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకున్నాడు.

పైగా అభిమాన హీరోగా కూడా నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత మగధీర( Magadhira ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించుకొని స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అందులో కొన్ని ఫ్లాప్, కొన్ని హిట్ లను అందుకున్నాడు.

అయినప్పటికీ కూడా ఈయనకు వరుసగా అవకాశాలు.ఇక రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ తో పాటు తను కూడా నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకున్నాడు.

తన పాత్రతో అందర్నీ ఫిదా చేసి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.

"""/" / ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వెంటవెంటనే మరో రెండు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇక చరణ్ మంచి హోదాలో ఉన్న సమయంలో ఉపాసన కామినేనిని( Upasana Kamineni ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ తనకు మొదటిసారిగా వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ను తనకు నచ్చిన వస్తువు కొనడానికి ఉపయోగించుకున్నాడట.

"""/" / అదేంటంటే చరణ్ కు బాగా హ్యాండ్ వాచెస్( Hand Watches ) అంటే ఇష్టమని.

అసలు ఇష్టం కాదు పిచ్చి అని తెలిసింది.ఇక వాటికోసం తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా అంత డబ్బు పెట్టేస్తాడట.

అయితే రీసెంట్గా తను ఈ విషయాన్ని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచాడు.తను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కచ్చితంగా ఒక వాచ్ కొనుక్కొని వస్తానని అన్నాడు.

ఇక తనకు బాగా ఇష్టమైన వాచ్ పటేక్ అట.ఇక కరోనా టైం లో కొన్నది మాత్రం తన బెస్ట్ వాచ్ అని అన్నాడు.

ఆ పార్సెల్ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడని తెలిపాడు.అందుకే చరణ్ ఎప్పుడు కనిపించినా కూడా ఆయన చేతికి ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కి సంబంధించిన వాచ్ లు కనిపిస్తూ ఉంటాయి.

యూఎస్: ఒకే తేదీలో నలుగురు అమ్మాయిలకు జన్మనిచ్చిన తల్లి.. అదెలా సాధ్యం?