చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా.?: మాజీ మంత్రి కొడాలి నాని
TeluguStop.com
టీడీపీ నేత నారా లోకేశ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా లోకేశ్ బిత్తర చూపులు చూశారని ఎద్దేవా చేశారు.
ఇంతకు ముందు లోకేశ్ పెద్ద పెద్ద మాటలు అన్నారన్న కొడాలి నాని ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
లోకేశ్ పాదయాత్ర చేస్తే కేసు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.తమ పేర్లు రెడ్ బుక్ లో లోకేశ్ రాస్తున్నారని, కానీ తాము లోకేశ్ పేరును చిత్తు కాగితాల్లో కూడా రాయమని చెప్పారు.
ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని ప్రకటించిన లోకేశ్ తన తండ్రి జైలుకు వెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అని అడిగారు.రెండు శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారన్న విషయాన్ని ప్రస్తావించిన కొడాలి నాని షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులు ఏమైనా పంచుతారా అని ప్రశ్నించారు.
బాబుకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇల్లు కాదు.అది జైలని తెలిపారు.
అక్కడ ఏదైనా వసతి కావాలంటే కోర్టును అడగాలని తెలిపారు.చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం తమకు తిరుగు లేదని ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో నేనంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు ఇప్పుడు ఆయనతో పాటు జైలుకు వెళ్తారా అని ప్రశ్నించారు.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…