బీజేపీ స్కెచ్ ఏంటో బాబుకి అర్థం అయ్యిందా లేదా ? 

రెండు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాన నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.

ఆజాదీక అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా చాలామంది నాయకులకే ఆహ్వానం పంపించారు.

దానిలో భాగంగానే టిడిపి అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది.ప్రధాని నరేంద్ర మోదీ తో నేరుగా భేటీ అయ్యే అవకాశం రావడంతో చంద్రబాబు ఉత్సాహంగా ఈ సమావేశంలో హాజరయ్యారు.

ఆ తరువాత ప్రధాన నరేంద్ర మోదీ తో కొద్ది నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం కావడం తదితర వ్యవహారాలు చోటు చేసుకోవడంతో, టీడీపీ- బిజెపి మధ్య పొత్తు చిగురుస్తుందనే ప్రచారం ఏపీలో విస్తృతంగా జరుగుతోంది.

అసలు చంద్రబాబు మొఖం చూసేందుకు కూడా చాలా కాలంగా ఇష్టపడని బిజెపి అగ్రనేతలు, ఇప్పుడు బాబుతో ప్రత్యేకంగా భేటీ కావడంతో, 2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం మొదలైంది.

ఈ వ్యవహారం వైసిపికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.అయితే నాలుగేళ్లుగా చంద్రబాబును దూరం పెట్టిన బిజెపి అగ్రనేతలు ఎప్పటికప్పుడు సానుకూలంగా మారడానికి కారణాలు మాత్రం చాలా ఉన్నాయట.

ప్రస్తుతం కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది.రెండుసార్లు అధికారంలోకి రావడంతో మూడోసారి అంతే స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీస్తుందనే  ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో పట్టు సాధిస్తూ వస్తోంది.

అయితే బలహీనంగా ఉన్న రాష్ట్రాల పైన బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించింది.గత ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూటమిగా ఏర్పాటు చేసి బిజెపికి వ్యతిరేకంగా పావులు కలపడం తదితర అంశాలు వంటివి ఇప్పుడు ఢిల్లీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న క్రమంలో కేసీఆర్ నేతృత్వంలోని మూడో ప్రత్యామ్నాయ కూటమి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, చంద్రబాబు ఇప్పుడు ఆ బాధ్యతలను తీసుకుని దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలను మొదలు పెట్టకుండానే  టిడిపితో సన్నిహితంగా మెలిగితే తమకు రాజకీయంగాను ఇబ్బందులు ఉండవు అనే ఆలోచనలో ఉందట.

"""/"/ అలాగే తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తుండడం, టిడిపి అక్కడ ఒంటరిగా పోటీ చేసే అంతటి సత్తా లేకపోయినా, ఆ పార్టీకి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో గట్టిపట్టు ఉండడం, ఇప్పటికీ టిడిపి కార్యకర్తలు తెలంగాణలో ఉండడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు, సామాజిక వర్గాల లెక్కలు ఇవన్నీ సరి చూసుకుంటూనే టిడిపి తో స్నేహం చేయడం వల్ల తెలంగాణలో బిజెపికి కలిసొస్తుందనే ఆలోచనలో ఉన్నారట.

అందుకే నేరుగా పొత్తు పెట్టుకున్న, పెట్టుకోకపోయినా సన్నిహితంగా మెలగడం వల్ల తెలంగాణలోను, కేంద్రంలోనూ తమకు ఇబ్బందులు ఉండవని లెక్కలు వేసుకుంటున్నారట.

అయితే బాబు మాత్రం ఇవేవీ పరిగణలోకి తీసుకోవడం లేదు.బిజెపికి సన్నిహితంగా మెలగడం వల్ల రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని, అధికార పార్టీ వైసీపీ పై బిజెపి విమర్శలు తీవ్రతరం చేస్తున్న తరుణంలో బిజెపి తమ వైపుకు మొగ్గు చూపుతుంది అనే లెక్కల్లో ఆయన ఉన్నారట.

జూబ్లీహిల్స్ కేసుపై విచారణ.. నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్..!