అధిక బరువుకు న‌ల్ల జీల‌క‌ర్రతో చెక్ పెట్టండిలా?

వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఎదుర్కొనే సాధార‌ణ స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

ఎంత వ‌ద్ద‌నుకున్నా పెరిగే బ‌రువును.ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

శరీరంలోని కొవ్వును మొత్తం కరిగించుకుని.మ‌ల్లె తీగ‌లా మారాల‌ని అంద‌రూ అనుకుంటారు.

ఈ క్రమంలోనే ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తిన‌డంతో పాటు.క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామాలు కూడా చేస్తుంటారు.

అయితే వాట‌న్నిటితో పాటు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను కూడా డైట్‌లో చేర్చుకుంటే.సులువుగా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు.

కాస్త చేదుగా, న‌ల్ల‌గా ఉంటే న‌ల్ల జీల‌క‌ర్ర వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒక‌టి.

వంట‌ల‌కు చ‌క్కని రుచిని ఇచ్చే న‌ల్ల జీల‌క‌ర్రల్లో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగున్నాయి.

అందులో ముఖ్యంగా అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు ఉద‌యం గోరు వెచ్చ‌ని నీటిలో న‌ల్ల జీల‌క‌ర్ర పొడి క‌లుపుకుని తీసుకోవాలి.

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే.శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తుంది.

మ‌రియు జీర్ణ స‌మ‌స్య‌లు దూరం చేసి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.అలాగే న‌ల్ల జీల‌క‌ర్ర‌తో మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోంటే.బ్ల‌డ్ షుగ‌ర్ లె‌వెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

మ‌రియు అధిక ర‌క్త‌పోటును అదుపులోకి తెస్తుంది.గొంతు నొప్పి, ద‌గ్గు స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డేవారికి కూడా న‌ల్ల జీల‌క‌ర్ర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

వేడి నీటితో న‌ల్ల జీల‌క‌ర్ర వేసి బాగా మరి‌గించుకోవాలి.ఆ నీటిని వ‌డ‌గ‌ట్టుకుని.

గోరు వెచ్చ‌గా అయిన‌ప్ప‌డు తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు నొప్పి,ద‌గ్గు స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

అలాగే ఈ నీరు తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్త‌డి కూడా దూరం అవుతాయి.

భారతీయులను దారుణంగా అవమానించిన కెనడియన్.. వీడియో వైరల్..