కాంగ్రెస్ విజయంలో బీజేపీ పాత్ర ఉందా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Election ) అనూహ్య ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

గత మూడు నెలల వరకు రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ ఎవరు ఊహించని రీతిలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

దీంతో అసలు కాంగ్రెస్ విజయనికి దారి తీసిన అంశాలేంటి ? కాంగ్రెస్ విజయంలో బీజేపీ పాత్ర కూడా ఉందా ? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

నిజానికి కర్నాటక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో హస్తంపార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతూ వచ్చింది.

ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం బీజేపీదేనని ఆ మద్య కమలనాథులు తెగ హడావిడి చేశారు.

"""/" / దాంతో పార్టీకి కూడా రాష్ట్రంలో బలం పెరుగుతూ వచ్చింది.

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లోనూ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ సత్తా చాటుతు వచ్చింది.

కానీ అనూహ్యంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో ఆ ప్రభావం తెలంగాణ బిజేపీ గట్టిగానే పడింది.

అదే టైమ్ లో పదవుల మార్పుకు అధిష్టానం తెర తీయడం కూడా పార్టీని గందరగోళానికీ గురిచేశాయి.

అంతవరకు పార్టీని ముందుండి నడిపించిన బండి సంజయ్ ( Bandi Sanjay )ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఒక్కసారిగా బిజేపీ గాడి తప్పింది.

"""/" / కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ( G Kishan Reddy )నాయకత్వం నత్తనడకన సాగడంతో కమలం పార్టీ ఎన్నికల ముందు డీలా పడింది.

దీంతో కాషాయ పార్టీని బలహీనతను అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ గత మూడు నెలల్లో బాగా పుంజుకొని బిజేపీ స్థానాన్ని ఆక్రమించింది.

పైగా కర్నాటక ఎన్నికల్లో విజయం లభించడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చిన అంశం.

ఇక అప్పటి వరకు ఏడమొఖం పెడమొఖంగా ఉన్న సీనియర్ నేతలు మరియు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఒక్కసారిగా కలిసిమెలిసి ఒకే తాటిపైకి వచ్చారు.

ఆరు గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడంలో సక్సస్ అయ్యారు.ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మరి విజయనికి దారి తీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ విజయనికి బిజేపీ పరోక్షంగా సహకరించిందనేది కొందరి వాదన.

పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!