జుట్టుకు తేనె రాస్తే తెల్ల‌బ‌డిపోతుందా.. అస‌లు నిజం ఏంటి..?

తేనె( Honey ).మధురంగా ఉండటమే కాదు ఎన్నో విలువైన పోషకాలను సైతం కలిగి ఉంటుంది.

అందువల్ల ఆరోగ్యపరంగా తేనె మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా తేనె తోడ్పడుతుంది.

అయితే జుట్టు విషయంలో మాత్రం చాలా మంది తేనెను దూరం పెడుతుంటారు.జుట్టుకు తేనె రాయడం వల్ల తెల్లబడిపోతుందని నమ్ముతుంటారు.

కానీ అది కేవలం అపోహ మాత్రమే.నిజానికి జుట్టుకు తేనె ఎంతో మేలు చేస్తుంది.

ఈ నేప‌థ్యంలోనే తేనెను జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? తేనె అందించే ప్రయోజనాలు ఏంటి.

? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

30 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఇలా చేయడం వల్ల ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్ పొందుతారు. """/" / హెల్తీ హెయిర్ గ్రోత్ ను తేనె ప్రోత్స‌హిస్తుంది.

తేనెను పైన చెప్పిన విధంగా వారానికి ఒక‌సారి వాడితే మీ కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.

తేనె మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల జుట్టుని సున్నితంగా ఉంచటమే కాకుండా తేనె మ‌న‌కు ఒక న్యాచుర‌ల్ కండిషనర్‌గా కూడా ప‌ని చేస్తుంది.

అలాగే తేనెలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

కురుల‌ను షైనీగా మారుస్తాయి.డ్రై హెయిర్ స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తాయి.

తేనె మీ జుట్టు యొక్క సహజ మెరుపును పునరుద్ధరించడం లో సహాయపడుతుంది.మ‌రియు జుట్టు ఆరోగ్యానికి అండంగా ఉంటుంది.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!