రాత్రుళ్లు పాల‌ను ఎవ‌రెవ‌రు ఎలా తీసుకోవాలో తెలుసా?

పాలు.ఓ సంపూర్ణ పౌష్టికాహారం.

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రికీ పాలు ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ఆరోగ్య లాభాల‌ను చేకూరుస్తాయి.

అందుకే ప్ర‌తి ఒక్క‌రు త‌మ డైలీ డైట్‌లో ఒక గ్లాస్ పాల‌ను త‌ప్ప‌కుండా చేర్చుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు.

అయితే కొంద‌రు పాల‌ను ఉద‌యం తాగితే.మ‌రికొంద‌రు రాత్రుళ్లు తాగుతుంటారు.

ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి మంచిదే అనుకోండి.కానీ, రాత్రుళ్లు పాల‌ను డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.కీళ్ల నొప్పులు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.అయితే కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు నైట్ నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో పావు టేబుల్ స్పూన్ శొంఠి పొడిని క‌లిపి సేవించాలి.

ఈ విధంగా పాల‌ను తీసుకుంటే కీళ్ల నొప్పులు ప‌రార్ అవుతాయి.అలాగే గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అయ్యేవారు.

రాత్రుళ్లు నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో కొద్దిగా జాజికాయ పొడిని క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే ఆయా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. """/" / అందాన్ని పెంచుకోవాలి అని భావించే వారు నైట్ నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో కుంకుమ పువ్వును చేర్చి తీసుకోవాలి.

త‌ద్వారా చ‌ర్మం య‌వ్వ‌నంగా, ప్ర‌కాశవంతంగా మెరుస్తుంది.ఏజింగ్ ప్రాసెస్ ఆల‌స్యం అవుతుంది.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.ఇక ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రో నిద్ర‌లేమితో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు.

అలాంటి వారు రాత్రుళ్లు పాల‌ల్లో ప‌సుపు క‌లిపి తీసుకోవాలి.ఇలా తీసుకుంటే సుఖ‌మైన‌, ప్ర‌శాంత‌మైన నిద్ర ప‌డుతుంది.

తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…