Rashmika Anand Devarakonda: రష్మికను ఆనంద్ దేవరకొండ ముద్దుగా ఇలా పిలుస్తాడా.. అబ్బో వదిన మీద ప్రేమ మామూలుగా లేదుగా?
TeluguStop.com
ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తమ్ముడైన ఆనంద్ దేవరకొండ తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారి దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.
అయితే ఈ సినిమాలో తన నటన బాగున్నప్పటికీ కూడా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ కూడా అంతంత మాత్రమే సక్సెస్ అయ్యాయి.
కానీ తన అన్న విజయ్ దేవరకొండ మాత్రం టాలీవుడ్ లో ఒక స్టేటస్ అనేది సొంతం చేసుకున్నాడు.
తక్కువ సమయంలోనే మంచి అభిమానం సంపాదించుకున్నాడు.కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా మళ్లీ అవకాశాలు అందుకుంటూనే ఉన్నాడు.
ఇక ఈయనకు అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా ఉండదని చెప్పాలి. """/" /
ముఖ్యంగా ఈయన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాడు.
అంతేకాకుండా హీరోయిన్ రష్మిక మందన్న తో( Rashmika ) గురుడు ప్రేమలో ఉన్నాడని గతంలో జోరుగా వార్తలయితే వచ్చాయి.
ఆ మధ్య వీరిద్దరూ ఒకే చోట దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
అంతేకాకుండా పలు సినిమాలలో వీరిద్దరి మధ్య రొమాన్స్ కూడా బాగా పండిందని చెప్పాలి.
అలా సినిమాల సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.
అంతే కాకుండా రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో బాగా క్లోజ్ గా ఉంటుందని.
ఆమధ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో కూడా రష్మిక ఉండటంతో.వాళ్లు కూడా రష్మికను కోడలిగా యాక్సెప్ట్ చేశారు అని తెలిసింది.
"""/" /
ఇప్పటికీ వీరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని.కానీ అది బయట పెట్టడానికి ఇష్టపడటం లేదని తెలిసింది.
కానీ కొంతమంది మాత్రం వీరి మధ్య బ్రేకప్ జరిగిందని.వీళ్ళిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారని అంటున్నారు.
కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటికి రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉందని అర్థమవుతుంది.
దానికి కారణం ఆనంద్ దేవరకొండ సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ ( Baby Movie ) అనే సినిమాలో నటించగా.
ఈ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రష్మిక మందన్నాను ఇన్వైట్ చేశాడు.
తమ ఫ్యామిలీకి రష్మిక చాలా క్లోజ్ కాబట్టి ఆనంద్ దేవరకొండ సినిమాకు తనవంతుగా ప్రమోషన్ లో పాల్గొంది.
అయితే ఈ సందర్భంలో.ఆనంద్ దేవరకొండ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
"""/" /
తాను లైఫ్‌లో ఏం పీకలేదని అన్నాడు.ఇక చాలా కాలంగా రష్మికతో ఉన్న పరిచయం కారణంగా ఆమెను రషి అని పిలుస్తానని అన్నాడు.
అదే సమయంలో ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ గురించి అడగటంతో రష్మిక ముసి ముసి నవ్వుతూ కనిపించింది.
ఇక ఆనంద్ రష్మికను అలా పిలుస్తాడని తెలియడంతో.అబ్బో వదిన మీద మామూలు ప్రేమ లేదు కదా అంటూ జనాలు అంటున్నారు.