వైరల్ వీడియో: వామ్మో.. సింహం ఇలా కూడా వేటాడుతుందా..?!

పులి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.అలాగే పులి వేట ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసిందే.

అందుకే పులిని చూస్తే ఎవరన్నా భయపడిపోతారు.పులి కంట్లో ఎవరన్నా పడ్డారంటే వాళ్ళని గుర్తుపట్టలేనంతగా చంపి తినేస్తుంది.

పులులు సాధారణంగా అడవిలోనే సంచరిస్తూ ఉంటాయి.మానవుని నివాస ప్రాంతాల్లోకి అంతా త్వరగా రావు.

అడవిలో ఉండే మిగతా జంతువులను వెటాడి వాటి ఆకలిని తీర్చుకుంటాయి.అలా జంతువులను వేటాడే సమయంలో కొన్ని గంటల పాటు సహనంగా వేచి చూస్తాయి.

అయితే పులులు, సింహాలు వేరే జంతువులను వేటాడే తీరు చూస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

మన అందరికి తెలిసి పులులు వేటాడే తీరు భలే ఆశ్చర్య కరంగా ఉంటుంది కానీ పులుల మాదిరిగానే అడవికి రారాజు అయిన మృగరాజు కూడా వేరే జంతువులను వేటాడడం కోసం ఎంతగానో శ్రమిస్తాయి అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.

ఈ వీడియోలో సింహం తన జూలు విదిల్చి కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి పందిని వేటాడింది.

ప్రస్తుతం సింహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

ఒకసారి సింహం వేట ఎలా సాగిందో చూద్దామా ఎంతో ఆకలిగా ఆకలిగా ఉన్న ఒక సింహం ఆహారం కోసం వేట మొదలు పెట్టింది.

"""/"/ ఏ జంతువు కనిపిస్తుందా దాన్ని అమాంతం నోటిలో వేసుకుని తినేద్దామా అని ఎదురుచూసే సింహానికి బురదలో ఓ ఆఫ్రికన్ అడవి పంది విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది.

ఇంకేముంది సింహం కన్ను అడవి పంది మీద పడింది.వెంటనే ముందుగా తన మెదడుకు పని చెప్పింది.

నిదానంగా బురదను తొవ్వడం ప్రారంభించింది. """/"/ ఇలా చాలా సమయం పాటు ఆ గుంతను తవ్వుతూ పూర్తిగా బురదలో మునుగుతూ, పడుతూ, లేస్తూ నానా తిప్పలు పడుతూ చివరకు తాను లోపల నక్కి ఉన్న అడవి పందిని పట్టేసింది.

సింహం నుంచి తప్పించుకోవడానికి ఆ అడవిపంది చాలా రకాలుగా ప్రయత్నం చేసింది.

కానీ సింహం దేని కోసం అన్నా ఒకసారి ఫిక్స్ అయితే దాన్ని ఎట్టి పరిస్థితులలో చేజారనివ్వదు కదా.

అసలే ఆకలి మీద ఉంది ఇంకా అడవిపందిని ఎలా వదిలేస్తుంది.అడవిపంది ఎన్ని ఎత్తుగడలు వేసిన సింహం ముందు అవన్నీ మటాష్చివరకు సింహనికి ఎరగా మారిపోయింది.

సింహం చేతిలో ఆ అడవి పంది ప్రాణాలు కోల్పోయింది ఈ షాకింగ్ వీడియోను లైఫ్ అండ్ నేచర్ అనే ట్వీట్టర్ తన ఖాతాలో షేర్ చేసారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు తమదైన శైలిలో సింహం వేట గురించి కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే..?