పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా:భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణా రాఘవ రెడ్డి ( Aruna Raghava Reddy )పేర్కొన్నారు.

తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య( Doddi Komuraiya ) వర్ధంతి కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ వేడుకలకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై యోధుడు దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.పోరాట స్ఫూర్తికి దొడ్డి కొమురయ్య ప్రతీక అని పేర్కొన్నారు.

తెలంగాణ( Telangana ) కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.ఆయన పోరాటం ప్రజలందరికీ స్ఫూర్తినిస్తూనేఉంటుందన్నారతెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గొల్ల, కుర్మల అభివృద్ధికీ పెద్ద పీట వేస్తున్నారనీ అన్నారు.

అందులో భాగంగానే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు బలహీన వర్గాల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్మాట్లాడుతూ, తెలంగాణలో రైతులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమురయ్య అని అన్నారు.

దొడ్డి కొమురయ్య మరణంతో రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ విప్లవంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరెట్ ఎ ఓ బి గంగయ్య, జిల్లా బిసి అభివృద్ధి అధికారి రాఘవేందర్, బి డబ్ల్యు ఓ లక్ష్మీ రాజం, సీపీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం,బిసి నాయకులు, గొల్ల, కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు .

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?