అయ్యో.. ఈ గర్భిణికి ఎదురైన విచిత్ర సమస్య.. ఏంటంటే?

ప్రెగ్నెన్సీ మహిళలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు పునర్జన్మ లాంటిది.

మాములుగా ప్రెగ్నెన్సీ టైం లో ప్రతి నెల వైద్యులతో చెక్ చేయించుకుంటూనే ఉంటాం.

లోపల పెరుగుతున్న పిండం అంతా బాగుందో లేదో.ఏదైనా ప్రాబ్లెమ్ ఉందో  లేదో అని చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే వైద్యులు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది.అయితే గర్భిణీ స్త్రీ లలో పిండం ఎక్కడ పెరుగుతుంది.

ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా.అవును మీరు విన్నది నిజమే.

గర్భిణీ స్త్రీ లలో ఎవరికైనా పిండం కడుపులోనే పెరుగుతుంది.అయితే ఈమెకు మాత్రం కాలేయంలో పెరుగు తుందట.

ఈ కేసు గురించి తెలుసుకున్న కెనడా వైద్యులు ఆశ్చర్య పోతున్నారు.వైద్యులు ఈ కేసును అత్యంత అరుదైనా కేసుగా పరిగణిస్తున్నారు.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.ఆ మహిళ వయసు 33 సంవత్సరాలు.

ఈమె గర్భం దాల్చిన 49 రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి సోనోగ్రఫీ చేయించుకుంది.

అయితే సోనోగ్రఫీ లో ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసిందట.స్త్రీ కడుపులో బదులుగా ఆమె కాలేయంలో పిండం కనిపించింది.

దీంతో ఆ మహిళకు ఎక్టోపిక్ గర్భం ఉందని వైద్యులు చెబుతున్నారు. """/" / అయితే ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని వారు చెబుతున్నారు.

ఈ విచిత్రమైన గర్భధారణ వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.మహిళను కాపాడవచ్చు కానీ శిశువుని కాపాడలేక పోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

వైద్యులు చెప్పిన విషయమే జరిగింది కూడా.వైద్యులు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడారు కానీ బిడ్డను మాత్రం కాపాడలేక పోయారు.

ఈ విషయాన్ని వైద్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ కేసు గురించి తెలుసుకున్న నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!