ప్రియాంక మర్డర్ కేస్.. ఆ 3 గంటల్లో ఏం జరిగింది?
TeluguStop.com
సంచలనం రేపిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య కేసులో కొన్ని కీలక ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు.
ముఖ్యంగా ఆమెకు ఈ దుస్థితి తలెత్తడానికి పోలీసుల వైఫల్యమే కారణమని ఆమె తండ్రి విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడీ ప్రశ్నలు చర్చనీయాంశం అయ్యాయి.
పోలీసులు చెబుతున్న వివరాలకు, పోస్టుమార్టం రిపోర్టుకు మధ్య తేడా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ రెండు వివరాలకు మధ్య మూడు గంటల సమయం తేడా వస్తోంది.దీంతో ఆ సమయంలో ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకారం.ప్రియాంక ఫోన్ స్విచాఫ్ అవడానికి, ఆమె చనిపోవడానికి మధ్య తేడా కేవలం 20 నిమిషాలు మాత్రమే.
రాత్రి 9.48 గంటలకు ఆమె ఫోన్ స్విచాఫ్ కాగా.
రాత్రి 10.08 గంటలకు ఆమెను చంపేశారని ఆయన వెల్లడించారు.
"""/"/
అయితే ఆమె తెల్లవారుఝామున 3 నుంచి 4 గంటల మధ్య చనిపోయి ఉంటుందని పోస్ట్‌మార్టం నివేదిక చెప్పడం గమనార్హం.
ఇక నిందితులు రాత్రి 12.57 గంటల సమయంలో కొత్తూరులోని పెట్రోల్ బంక్‌కు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
కేవలం అరగంట సమయం పట్టే ప్రయాణానికి మూడు గంటలు పట్టింది.అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? లారీలోనే వాళ్లు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారా? ఎంతో బిజీగా ఉండే హైవేపై ఇంత దారుణం జరుగుతుంటే.
హైవే పెట్రోలింగ్ పోలీసులు ఏం చేస్తున్నారులాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.అసలు ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉన్నా.
ఈ ఘోరం జరిగేది కాదు అని భావిస్తుంటే.ఈ మూడు గంటల సమయంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది.
ఆమె ఎప్పుడు చనిపోయింది? సీపీ చెప్పిది నిజమా లేక పోస్ట్‌మార్టం రిపోర్టా అన్నదీ తేలాల్సి ఉంది.
ఈ కేసులో నిందితులను తొందరగానే పట్టుకున్నారు కానీ.ముందుగానే పోలీసులు ఇంత వేగంగా స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడు బస్సులో ఇప్పుడు లోకల్ ఛానల్ లో.. గేమ్ ఛేంజర్ ప్రసారంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!