పోలీసుల కళ్లు గప్పి పరారైన డాక్టర్ రవీంద్రనాథ్

నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి పట్టణం లో స్థానికంగా ఉంటున్న ఒక వైద్యుడు నర్స్ ను లైంగికంగా వేధిస్తున్నట్లు నిన్న ఆరోపణలు రావడం తో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే అతడు పోలీస్ కస్టడీ లో ఉండకుండా వారి కళ్లు గప్పి స్టేషన్ నుంచి పారారైనట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.ఉదయగిరి స్థానికంగా ఉండే ఆసుపత్రి లో రవీంద్ర నాథ్ డీడీ వో గా పనిచేస్తున్నాడు.

అయితే, అక్కడ పని చేస్తున్న నర్సులతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

ఓ నర్సును రాత్రివేళ పిలిచి అత్యాచారయత్నం చేయడంతో ఈ డాక్టర్ గారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

దీంతో, నర్సు బంధువులు వచ్చి రవీంద్రనాథ్ కు దేహశుద్ధి చేయడం తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం తో పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకొని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

నిన్న రవీంద్రనాథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కు తరలించారు.అయితే అతడు స్టేషన్ నుంచి పోలీసుల కళ్లు గప్పి అక్కడ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.

దీనితో పోలీసుల నిర్లక్ష్యం పై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

చీక‌ట్లో మొబైల్ వాడ‌టం వ‌ల్ల ఎన్ని న‌ష్టాలో తెలుసా?