ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కామాంధుడి గా మారి యువతి పై….
TeluguStop.com
ప్రస్తుత కాలంలో ఆడ పిల్లలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని సంక్షోభంలో జీవనం సాగిస్తున్నారు.
తాజాగా ఓ యువతి అనారోగ్యం కారణంగా గా వైద్యుడి దగ్గరికి వెళ్లడంతో వైద్యం చేయాల్సిన డాక్టర్ కామాంధుడిగా మారి ఆమె పై అత్యాచారం చేయడానికి యత్నించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టువంటి ఏలూరు పట్టణ పరిసర ప్రాంతంలో ఓ యువతి నివాసముంటోంది.
అయితే ఈ యువతి ఇటీవలె కొంతమేర అస్వస్థతకు గురైంది.దీంతో యువతి స్థానికంగా ఉన్నటువంటి ఒక క్లినిక్ కి చికిత్స నిమిత్తం వెళ్ళింది.
అయితే వైద్యుడు ఆమెకి వైద్యం అందించాల్సి పోయి మత్తు మందు ఇచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారానికి తెగబడ్డాడు.
ఇది గమనించిన టువంటి యువతి వెంటనే మత్తులో నుంచి తేరుకొని వైద్యుడి బాగోతాన్ని బయటపెట్టి స్థానికుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి ఇ పలురకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.దీంతో కొందరు నెటిజన్లు గౌరవ ప్రధమైనటువంటి వైద్య వృత్తిని చేపట్టి ఇలా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్న వైద్యుడిని దారుణంగా శిక్షించాలని అని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
రాజమౌళి సినిమాలలో ఆ సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయట.. ఏం జరిగిందంటే?